హైదరాబాద్ : MIM తో దోస్తీ.. కానీ కాంగ్రెస్ అసలు ప్లాన్ అదేనా?
అయితే ఎంఐఎం పార్టీతో తమకు స్నేహం ఉందని హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆ పార్టీతో ఫ్రెండ్లీ పోటీ ఉంటుందని.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పారు. కానీ నిజానికి స్నేహపూర్వక పోటీ కాదు కుదిరితే వారి కంచుకోట హైదరాబాద్లోనే ఎంఐఎం ను ఓడించాలని కాంగ్రెస్ భావిస్తుందట. ఇక దీనికోసం హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో ఎంఐఎం కు పోటీగా భావిస్తున్న మజిలీస్ బచావో తెహరిక్ పార్టీతో కాంగ్రెస్ ఒప్పందం కోసం చర్చలు జరుపుతుందట. కాగా ఎంబిటీ పార్టీకి హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మూడు చోట్ల బలమైన ఓటు బ్యాంకు ఉంది.
ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మైనారిటీల మద్దతు ఉండనే ఉంది. దీంతో ఎంబిటీతో పొత్తు పెట్టుకుంటే ఇక మజిలీస్ పార్టీని ఏకంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఓడించేందుకు అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ అనుకుంటున్నాడట. ఇలా ఎంఐఎం ను వారి సొంత గడ్డమీద ఓడిస్తే మైనార్టీ ఓటు బ్యాంకు మరింత బలపడుతుందని లెక్కలు కూడా వేసుకుంటున్నారట. అదే సమయంలో ఎంఐఎం ను గుడ్డిగా నమ్మలేమని.. అధికారంలో ఉన్న పార్టీతో ఎప్పుడు స్నేహం నటిస్తుంది తప్ప.. నిజమైన భాగస్వామిగా ఏ పార్టీని భావించదని కాంగ్రెస్ పెద్దలు కూడా విశ్వసిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎమ్ఐఎంతో స్నేహపూర్వక పోటీ ఉంది అని రేవంత్ చెప్పినప్పటికీ.. లోలోపల మాత్రం మరో మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతున్నారట సీఎం. ఏం జరుగుతుందో చూడాలి.