సీఎం జగన్ పథకాలను మించి చంద్రబాబు ఇవ్వగలరా.. సాధ్యమేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఏడాది కూడా నగదు బదిలీ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలలో భాగంగా ప్రతి ఏడాది కూడా 52,000 కోట్ల రూపాయలు ఏపీ సీఎం పంచుతున్నారు. ఇక చంద్రబాబు చెప్పేటువంటి హామీలతో ప్రతి ఏడాది కూడా రూ.1.40 లక్షల కోట్లు అవుతుందని తెలియజేస్తున్నారు.. అయితే ఇందులో కొన్ని తప్పనిసరిగా అమలు చేయవలసిన పథకాలు ఉన్నాయనే విషయం ఏపీ సీఎం తెలియజేశారు.. సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య గట్టి పోటీనే నెలకొంటోంది.

నిన్నటి రోజున మేదర మెట్ల లో జరిగిన ఆఖరి సిద్ధం సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ఆసక్తికరమైన లెక్కలను వివరించారు.. ఏపీలో ఏటా తప్పనిసరిగా అమలు చేయవలసిన సంక్షేమ పథకాలకి 52 కోట్లు ఖర్చు చేస్తుంటే.. ఐదేళ్లలో 2 లక్షల 770 వేల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా వెళుతుందని వివరించారు.. కోవిడ్ కారణంగా రాష్ట్ర పరిస్థితి ఇబ్బందిగా ఉన్న వెనుకంజ వేయకుండా సంక్షేమ పథకాలు ఇంటింటికి కూడా అందించామంటూ వివరించారు.. నాన్ డెబిట్.. డెబిట్ పథకాల ద్వారా దాదాపుగా రూ.3.70 లక్షల కోట్ల ప్రజలకు ఖర్చు చేశామంటూ తెలియజేశారు

వైసీపీ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయవలసిన పథకానికే 52,000 కోట్లు ఏటా చెల్లించాల్సి ఉంటే చంద్రబాబు ఇచ్చిన హామీలతో కలుపుకుంటే ప్రతి ఏడాది రూ.1.40 లక్షల కోట్లు అవుతుందని సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రతి యేట రూ.73,440 కోట్ల రూపాయలు అవసరమని ఏపీ ఆర్థిక శాఖ అంచనా వేసినట్లుగా సీఎం జగన్ ఈ సిద్ధం సభలో తెలియజేశారు.. ఒకవేళ బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ కలుపుకుంటే 13,872 ఓట్లు అవసరమవుతాయని దీంతో చంద్రబాబు ప్రకటించిన 7 పథకాలకు 87 కోట్ల రూపాయలు అవసరమని ఇప్పటికీ అమలు చేసిన డెబిట్ పథకాలతో కలుపుకుంటే మొత్తం మీద రూ.1.40 లక్షల కోట్లు అవుతుందని వివరించారు. గడిచిన ఏడాది టిడిపి ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలతో పాటు త్వరలోనే మళ్లీ కొత్త మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తామని చెబుతున్నారు.. దీని బట్టి ప్రజలు ఎవరు మంచి చేస్తారని విషయాన్ని గుర్తించాలని వివరించారు సీఎం జగన్.. ఎవరి వల్ల అప్పుల పాలవుతుందో ప్రజలు గుర్తించాలని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: