నటి హేమ పరిస్థితిని చూస్తే పాపం అనకుండా ఉండలేరేమో..??

Suma Kallamadi
సినీనటి హేమ బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో డ్రగ్స్ వాడిందనే ఆరోపణలు వచ్చాయి. బెంగళూరు పోలీసులు పార్టీలో ఆమెను చూసినట్లు సాక్ష్యం చెప్పారు. దాని కారణంగా ఆమెను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. కొద్ది రోజులపాటు హేమ బెంగళూరు జైలులోనే గడపాల్సి వచ్చింది. చివరికి ఆమెను గురువారం షరతులతో కూడిన బెయిల్‌పై జైలు నుంచి విడుదల చేశారు. బెంగళూరు కోర్టు హేమకు బెయిల్ ఇచ్చింది.
హేమ డ్రగ్స్ వాడినట్లు పోలీసుల దగ్గర సాక్ష్యం లేదని నటి తరఫు లాయర్ కోర్టులో వాదించారు. ఇదిలా ఉంటే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు ప్రూవ్ చేసే ఎవిడెన్స్‌ను సీసీబీ లాయర్ కోర్టుకు సమర్పించారు. అయితే తను రేవ్ పార్టీలో లేనని హేమ చాలాసార్లు చెప్పుకుంది. ఆ టైంలో తను ఇంట్లోనే ఉన్నానని, బిర్యానీలు చేసుకున్నాను అని వీడియోలతో సహా చూపిస్తూ తన అమాయకత్వాన్ని చాటుకోవడానికి ప్రయత్నించింది. అయితే బెంగళూరు పోలీసులు మాత్రం ఆమెను తాము పార్టీలో కళ్లారా చూసామని, ఫోన్ మాట్లాడతానని చెప్పి ఆమె బయటకు వచ్చి అట్నుంచి అటే పారిపోయిందని అన్నారు.
ఇలా మోసం చేసి వెళ్లడం వల్లే ఆమెను అరెస్టు చేస్తున్నామని కూడా వారు స్పష్టం చేశారు. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఆమె సూత్రధారి హా లేదంటే పాత్రధారా? అనేది ఇంకా తెలియ రాలేదు. అయితే ఆమె జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఫ్యాన్స్ సెల్ఫీలు ఇవ్వాలంటూ చాలా ఇబ్బంది పెట్టేశారు. మరోవైపు మీడియా వాళ్ళు ఆమెను ఫోకస్ చేస్తూ మరింత ఇబ్బందికి గురి చేశారు. అయినా హేమ అభిమానులకు నవ్వుతూ సెల్ఫీలు ఇచ్చింది. ఆ తర్వాత బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది. కేసు గురించి ఆమె ఏం మాట్లాడుతుందో ఆసక్తికరంగా మారింది. నిజ నిజాలు ఏంటో త్వరలోనే తేలే అవకాశం ఉంది కానీ హేమ మాత్రం జైలుకు వెళ్లి చాలానే కష్టాలు పడింది ఆమె పరిస్థితిని చూసి అయ్యో పాపం అని టాలీవుడ్ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. హేమ కంటే ముందు డ్రగ్స్ కేసులో సంజన, రాగిణి ద్వివేది వంటి వారు కూడా అరెస్టయి తర్వాత విడుదలైయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: