ఎమ్మెల్సీల కేసుతో తెలంగాణలో విచిత్ర పరిస్థితి?

Chakravarthi Kalyan
తెలంగాణలో రాజ్యాంగ పరమైన సంక్షోభం తలెత్తింది.  గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో వివాదానికి సంబంధించి హైకోర్టు సంచలన తీర్పు వెలవరించింది. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా భారాస హయంలో మంత్రి మండలి సిఫార్సు చేసింది. దీనిని తిరస్కరిస్తూ గతేడాది సెప్టెంబరు 19న గవర్నర్ చే జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది.

అనంతరం జనవరి 13న ప్రోఫెసర్ కోదండరాం, ఆమిర్ అలీఖాన్ ల పేర్లతో కూడిన కొత్త ప్రభుత్వం చేసిన సిఫార్సును వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ జనవరి 27న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. అధికరణ 171(5) ప్రకారం గవర్నర్ తన అధికారాలను వినియోగిస్తున్నప్పుడు మంత్రి మండలి సహకారం, సలహాలకు కట్టుబడి ఉండాల్సిందేనని  హైకోర్టు స్పష్టం చేసింది. అయితే మంత్రి మండలి సిఫార్సు చేసిన వ్యక్తుల అర్హతలను పరిశీలించే అధికారం గవర్నర్ కు ఉందని స్పష్టం చేసింది. అదనంగా అవసరమైన పత్రాలు, పునస్సమీక్షించాలంటూ వెనక్కి పంపే అధికారమూ గవర్నర్ కు ఉందని తేల్చి చెప్పింది.

గవర్నర్ కు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా, దురుద్దేశ పూరిత చర్యలు తీసుకున్నప్పుడు సమీక్షించే అధికారం న్యాయ స్థానానికి ఉంటుందని హైకోర్టు పేర్కొంది. గవర్నర్ దురుద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని వివరించింది.

అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై కి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఉండేది.  దీంతో గతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను ఆపేవారు. గవర్నర్ ఒక ప్రతిపాదనను తిరస్కరించారు. మరోకదానిని ఆమోదించారు. అయితే ఆమోదించిన దానిని హైకోర్టు కొట్టివేసింది. ఇందులో రాజ్యాంగ సంక్షోభం ఏంటంటే.. గవర్నర్ కు మాత్రమే నియామక అధికారం ఉంది. కానీ అప్పటి ప్రభుత్వం ఇప్పుడు లేదు. ప్రస్తుత ప్రభుత్వానికి వీళ్లు అవసరం లేదు. మరి ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారు. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది. లేదా గత మంత్రి మండలి సిఫార్సు చేసిన పేర్లను అర్హులని కోర్టు చెప్తుందా అంటే ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: