అమరావతి : పవన్ రాజకీయం రివర్సులో నడుస్తోందా ?

Vijaya

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయమంతా రివర్సులో నడుస్తోంది. ఏ ముహూర్తాన పదేళ్ళక్రితం పార్టీ పెట్టారో తెలీదు కాని ఒక అడుగు ముందుకు పదిఅడుగులు వెనక్కు అన్నట్లుగా నడుస్తోంది. విషయం ఏమిటంటే పార్టీ పెట్టి పదేళ్ళవుతున్నా ఇప్పటివరకు పలానా నియోజకవర్గంలో పోటీచేస్తారని చెప్పుకునేందుకు లేదు.  జగన్మోహన్ రెడ్డి అనగానే అందరికీ పులివెందుల గుర్తుకొస్తుంది. చంద్రబాబునాయుడు పేరుచెప్పగానే కుప్పం అంటారు. చివరకు లోకేష్ పేరుచెప్పినా మంగళగిరిలో పోటీచేయబోతున్నట్లు చెప్పేస్తారు. అలాంటిది పవన్ పేరుచెబితే ఏ నియోజకవర్గంలో పోటీచేస్తారో ఎవరూ చెప్పలేని స్ధితి.



ఎందుకంటే తాను ఎక్కడినుండి పోటీచేయాలో పవన్ కే తెలీదుకాబట్టి. తాను ఎక్కడినుండి పోటీచేసేది ముందే చెబితే జగన్ తనను ఓడిస్తారనే భయం పవన్లో రోజురోజుకు పెరిగిపోతోంది. నిజానికి పవన్ అంటే ప్రత్యర్ధులు భయపడాలి. సినిమాల్లో పవర్ స్టార్, కాపు సామాజికవర్గమంతా వెనకుందని చెప్పుకునే పవన్ కు వ్యతిరేకంగా పోటీచేయాలంటే ప్రత్యర్ధులు భయపడాలి. ఎక్కడ నామినేషన్ వేసినా సరే పవన్ గెలుపు గ్యారెంటీ అనేట్లుండాలి పరిస్ధితి. సినిమాల్లో పవన్ కున్న ఫ్యాన్ బేస్ ఇంకెవరికీ లేదు.



అలాగే కాపులు కూడా ఈసారి ఎన్నికల్లో తమ ప్రతినిధిగా పవన్ను ఉన్నతంగా చూడాలని కోరుకుంటున్నారు. అందుకనే కాపులందరు కాకపోయినా ముఖ్యంగా యూత్ జనసేనకు మద్దతుగా నిలబడే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్ధితిని అడ్వాంటేజ్ గా తీసుకున్న పవన్  ప్రత్యర్ధులకు చుక్కలు చూపించేస్ధితిలో ఉండాలి. అలాంటిది జగన్ను చూసి పవనే భయపడిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే పోయిన ఎన్నికల్లో పోటీచేసిన రెండునియోజకవర్గాలు గాజువాక, భీమవరంలో ఓడిపోవటమే.



అప్పటినుండి పవన్ కు జగన్ ఫోబియా బాగా పట్టుకున్నట్లుంది. ఆ ఫోబియా బయటకు కనబడకుండా జగన్ను పట్టుకుని నీ స్ధాయెంత..నీబతుకెంత అంటు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. జగన్ కు రాబోయే ఎన్నికల్లో చుక్కలు చూపిస్తామని పైకి చాలెంజులు చేస్తున్న పవన్ లోలోపల జగన్ అంటే తానే వణికిపోతున్నాడు. దీనికి ఉదాహరణ ఏమిటంటే తాను పోటీచేయబోయే నియోజకవర్గాన్ని ఇప్పటివరకు రహస్యంగా ఉంచటమే. జనసేన పోటీచేయబోయే 24 నియోజకవర్గాల్లో ఐదుగురు అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు కాని తాను పలానా నియోజకవర్గం నుండి పోటీచేయబోతున్నట్లు ప్రకటించలేకపోయారు. దీంతోనే పవన్ రాజకీయమంతా రివర్సులో నడుస్తోందని అందరికీ అర్ధమైపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: