తెలంగాణ సీఎం కూడా నా ఫ్రెండే అంటున్న వర్మ..!!

Divya
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీలో సంచలన డైరెక్టర్ గా పేరు పొందారు.. ఎంతోమంది కొత్త డైరెక్టర్లు వస్తూ ఉన్నప్పటికీ ఎంతోమందికి మార్గదర్శిగా మారారు.. వర్మ గతంలో తీసిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఏ డైరెక్టర్ చూపించలేని విధంగా సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద డైరెక్టర్లు కొనసాగుతున్న చాలామంది డైరెక్టర్లు వర్మ దగ్గర అసిస్టెంట్గా పనిచేసినవారే.. అలాంటి రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు తీస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలిసిందే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటారు వర్మ..

ఎప్పటికప్పుడు తన ట్విట్లతో సోషల్ మీడియాని షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పోస్టులు పెడుతూ పెద్ద ఎత్తున పాపులారిటీ అందుకున్నారు. గతంలో కూడా వైసిపి పార్టీకి అనుకూలంగా ఉండే చిత్రాలని తీయడం జరిగింది.. ఇప్పుడు వ్యూహం, శపధం అనే పేరుతో మరొకసారి ఆంధ్ర రాజకీయాలను అచ్చు గుద్దేల జగన్ ,పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు నాయుడు వంటి వారిపైన సినిమాలను చేశారు.. ఈ సినిమాలను ఎంతో కసితో వర్మ పూర్తి చేశారు.. అయితే మధ్యలో ఈ సినిమా పైన కేసు నడవడం వల్ల కాస్త ఆలస్యంగా మారింది..

ఇదంతా ఇలా ఉండగా వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో తాజాగా పాల్గొన్న వర్మ తన సినిమాకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకున్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ మీరు ఎందుకు ఆంధ్ర రాజకీయాల వైఫై మక్కువ చూపుతారు అని అడగగా దీనికి రాంగోపాల్ వర్మ సమాధానాన్ని తెలుపుతూ తనకు రాజకీయంగా అసలు నాలెడ్జ్ లేదని ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయాలు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నానంటే తను గతంలో తీసిన సినిమాల వల్లే అంటూ తెలిపారు.. అలాంటి సమయంలోనే వైయస్ జగన్ గురించి తెలుసుకోవడం జరిగింది అందుకే ఎన్నో సినిమాలు తీశాను అంటూ తెలిపారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తనకు బాగా తెలుసని ఈ సందర్భంగా తెలిపారు. రేవంత్ రెడ్డి తనకు చాలా సన్నిహితుడు అని కూడా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RGV

సంబంధిత వార్తలు: