అదృష్టమంటే వీరిదే.. ఒకేసారి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగం?

praveen
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఒక్కరు కూడా ఆశ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చదువు పూర్తయిన వెంటనే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు పోటీ పరీక్షల కోసం పుస్తకాల పురుగుల్లా మారిపోయి తెగ చదివేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఎవరైనా ఇలా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అంటే చాలు వాళ్ళ దగ్గరికి వెళ్లి చూస్తే రూమ్ నిండా కూడా పుస్తకాలే కనిపిస్తూ ఉంటాయి. అవి చూసి వామ్మో వీళ్ళు ఇన్ని పుస్తకాలు చదువుతారా అనే భావన అందరికీ కలుగుతూ ఉంటుంది.

 ఇక ఇటీవల కాలంలో గవర్నమెంట్ జాబ్స్ కి డిమాండ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా స్వీపర్ జాబులకు సైతం గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. 100 జాబులకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఏకంగా లక్షల మంది ఈ జాబులు కోసం అప్లై చేస్తూ పోటీ పరీక్షలకు హాజరవుతున్నారు. అయితే ఇంత కష్టపడిన గవర్నమెంట్ జాబ్ వస్తుందా అన్నది మాత్రం కన్ఫార్మ్ గా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ దక్కింది అంటే చాలు వాళ్లను మించిన అదృష్టవంతులు మరొకరు లేరు అని అంటూ ఉంటారు.

 అయితే ఇక్కడ ఒకేసారి అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవల విడుదలైన సాఫ్ట్ నర్స్ ఫలితాల్లో పలువురు సత్తా చాటారు. ఖమ్మం జిల్లా గుర్రాల పాడుకు చెందిన దొడ్డ స్వరూపు, కోటేశ్వరి ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అయితే కరీంనగర్ జిల్లా లింగాపూర్ కు చెందిన అన్నా చెల్లెళ్లు కుమారస్వామి, శిరీష. కామారెడ్డి జిల్లా సీతయ్య పల్లి వాసులు పండరి, విటల్. నారాయణపేట జిల్లా గుణ్ముఖ్లకు చెందిన అక్క చెల్లెళ్లు నాగజ్యోతి, చంద్రకళ ఇలా సాఫ్ట్ నర్స్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: