అమరావతి : టికెట్లను ఎల్లోమీడియానే డిసైడ్ చేస్తుందా ?

Vijaya

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఎల్లోమీడియా వ్యవహారం చాలా విచిత్రంగా తయారవుతోంది. ఎలాగంటే వైసీపీలో సిట్టింగులకు మళ్ళీ ఎందుకు టికెట్లు ఇవ్వటంలేదని అడిగేంతగా.  అధికారపార్టీలో ఎవరెక్కడ పోటీచేయాలో డిసైడ్ చేయాల్సింది పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సర్వేలు చేయించుకుంటు, ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటున్న జగన్ కొందరు ఎంఎల్ఏలకి టికెట్లు నిరాకరిస్తున్నారు. మరికొందరికి నియోజకవర్గాలను మార్చుతున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావటం కోసమే. ఇన్నిమార్పులు చేసినా వైసీపీ అధికారంలోకి వచ్చేస్తుందా అని అడిగితే కాలమే సమాధానం చెప్పాలి.



అయితే వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఎల్లోమీడియాకు ఏమాత్రం నచ్చటంలేదు. ఎలాగంటే టికెట్లు రానివాళ్ళు, నియోజకవర్గాలు మారుతున్నవాళ్ళు కూడా జగన్ను పెద్దగా టార్గెట్ చేయటంలేదు. ఎల్లోమీడియా ఉద్దేశ్యం ఏమిటంటే అసంతృప్తులంతా జగన్ పై ధ్వజమెత్తాలని. అయితే ఇద్దరు ముగ్గురు మాత్రమే కొద్దిగా అసంతృప్తిని వ్యక్తంచేశారు. దాన్నే మహాప్రసాదంగా ఎల్లోమీడియా ఫ్రంట్ పేజీల్లో వార్తలుగా చేసుకున్నది. ఇపుడు విషయం ఏమిటంటే తిరువూరులో రక్షణనిధికి జగన్ అన్యాయం చేశారట. మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరిగినా తీసుకోలేదట.



ప్రచారాలు జరుగుతున్నట్లు అందరినీ మంత్రివర్గంలోకి తీసుకోలేరన్న ఇంగితాన్ని కూడా ఎల్లోమీడియా వదిలేసింది. టికెట్ ఇవ్వకుండా రక్షణనిధికి జగన్ మొండిచెయ్యి చూపటం చాలా అన్యాయమట. అలాగే గంగాధర నెల్లూరులో నారాయణస్వామికి కూడా జగన్ ద్రోహం చేశారట. పార్టీకి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్న నారాయణస్వామిని చిత్తూరు ఎంపీగా పోటీచేయించాలని డిసైడ్ చేశారట. దాంతో నారాయణస్వామికి జగన్ ద్రోహం చేశారట. టికెట్ వస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్న నందికొట్కూరు ఎంఎల్ఏ ఆర్థర్ కు కూడా జగన్ అన్యాయం చేశారట.



కడపలో డాక్టర్ సుధీర్ కు నందికొట్కూరులో టికెట్ ఇచ్చి ఆర్థర్ టికెట్ చించేశారట. శింగనమలలో జొన్నలగడ్డ పద్మావతిని పక్కనపెట్టి అన్యాయం చేశారట. పార్టీకి, తనకు ఎంతో వీరవిధేయులుగా ఉన్న వాళ్ళకి కూడా జగన్ టికెట్లు చించేయటం చాలా అన్యాయం  చేసినట్లే అని ఎల్లోమీడియా ఎంతో జాలిచూపిస్తోంది. అంతర్గతంగా ఎల్లోమీడియా ఉద్దేశ్యం ఏమిటంటే టికెట్లు దక్కని వాళ్ళని జగన్ కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడమే. సిట్టింగు ఎంఎల్ఏలందరికీ మళ్ళీ వాళ్ళ నియోజకవర్గాల్లోనే టికెట్లు ఇవ్వాలన్నట్లుగా పెద్ద కథనం ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: