అసెంబ్లీలో జగన్‌ సీటు ఎక్కడో.. బాబు ఏంచేస్తారో?

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 లేదా 19 నుంచి ప్రారంభం అవుతాయనే ప్రచారం జోరుగా నడుస్తోంది. 17 మంచి రోజు ఏకాదశి తిథి ఉంది. అయితే అదే రోజున బక్రీద్ పండుగ ఉన్నందున 19 వ తేది బుధవారం మంచి ముహూర్తం ఉన్నందున ఆ రోజు జరిగే అవకాశాలు ఉండొచ్చు అని పలువురు భావిస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే వారం వ్యవధిలో కొత్త అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం ఖాయం.

ఈ నెలఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి కూడా ముగుస్తుంది. పూర్తి స్థాయి బడ్జెట్ ను అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆమోదించుకోవాలి. అలాగే కొత్త సభ్యుల అంతా ప్రమాణం చేయాలి. స్పీకర్ ఎన్నిక జరగాలి. అందువల్ల అసెంబ్లీ సమావేశాలను వీలైనంత త్వరగా నిర్వహిస్తారు. అయితే ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ హాజరు అవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం పది శాతం సీట్లు రావాలి. అంటే ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి కాబట్టి 18 సీట్లు రావాలి. కానీ ఆ పార్టీకి 11 మాత్రమే రావడంతో ప్రతిపక్ష హోదా గల్లంతైంది. ఈ క్రమంలో తమకు ప్రతిపక్ష హోదా ఇస్తారో లేదో అని ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో తీవ్ర నిర్వేదంతో మాట్లాడారు.

అయితే జగన్ కు ఏ పాత్ర ఉండబోతుందో 19వ తారీఖు తేలిపోతుంది. ప్రతిపక్ష హోదా ఎలాగూ లేదే కాబట్టి ఎమ్మెల్యేల మధ్యలో కూర్చోబెడతారా.. లేక ఒక మూలన కూర్చో బెడతారా అనేది తేలుతుంది. అక్షర క్రమం చూసుకుంటే ఇంటిపేరు వై వస్తుంది కాబట్టి ఆఖరి వరుసలో సీటు వస్తుంది. ఎమ్మెల్యేల మధ్యలో కూడా అసెంబ్లీ హాల్ లో చివరన విసిరినట్లు సీటు కేటాయించి.. తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటారా లేక.. ప్రధాన ప్రతిపక్షం ఉండాలని భావించి మొదటి లైన్లో సీట్లు ఏర్పాటు చేస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: