అప్పుడు శివాలెత్తిన సజ్జల ఇప్పుడు సైలెంట్.. బాబు టార్గెట్ చేస్తారని భయపడుతున్నారా?

Reddy P Rajasekhar
ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమని చాలామంది భావిస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పని చేసిన సజ్జల పార్టీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నేతలపై శివాలెత్తగా ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. బాబు టార్గెట్ చేస్తారని సజ్జల భయపడుతున్నారా అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
కూటమి గెలుపు ఖాయమని ఎన్నికల ఫలితాల ముందే సజ్జల సంకేతాలు ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమయ్యాయి. సజ్జల భార్గవ్ కు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించడం కూడా జగన్ చేసిన అతిపెద్ద తప్పు అని ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రచారం జరిగింది. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు తప్పని వాదించిన సజ్జల ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదు.
 
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సజ్జల ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సైతం సమాధానాలు దొరకడం లేదు. వైసీపీ ఆవిర్భావం నుంచి వివిధ పదవులను నిర్వహించిన సజ్జల కష్టకాలంలో వైసీపీకి అండగా నిలవడం లేదని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఊరూపేరు లేని యూట్యూబ్ ఛానెళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ జంప్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 
మీడియాతో ప్రతి సందర్భంలో మాట్లాడే అవకాశం సజ్జలకు ఇచ్చి జగన్ సరిదిద్దుకోలేని తప్పు చేశారని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కు మీడియాకు మధ్య గ్యాప్ పెరగడానికి ఒక విధంగా సజ్జల కారణమనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. సజ్జలను టీడీపీ కక్ష సాధింపు చర్యలకు దిగితే మాత్రం సజ్జల భవిష్యత్తు ప్రమాదంలో పడటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. సజ్జలకు ప్రస్తుతం పరిస్థితులు మాత్రం అనుకూలంగా లేవు.  రాబోయే రోజుల్లో జగన్ సజ్జల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: