చంద్రబాబును బాగా భయపెడుతున్న సమస్య ఇదే?

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా ఏపీ సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.  ఈ మేరకు సోమవారం పోలవరాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన విధానాలు, పనితీరు నివేదికలను వారంలో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అయితే ఈ పోలవరం పనులకు పలు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.

మాజీ సీఎం జగన్ ఐదేళ్లలో చేసిన విధ్వంసం పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది. మొండిగా రివర్స్ టెండరింగ్ అమలుతో అంతులేని నష్టం జరిగింది. పైగా బోడి గుండుకు.. మోకాలికి ముండి వేసినట్లు కాఫర్ డ్యాంల ఎత్తును పెంచకపోవడం వల్ల డయా ఫ్రం వాల్ దెబ్బతిన్నదన్న మూర్ఖపు వాదనను తెరపైకి తెచ్చారు. 2019 నవంబరులో కొత్త కాంట్రాక్ట్ సంస్థ పనులు ప్రారభించి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్ఆయం నిర్మానం చేపట్టి ఉంటే.. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ జగన్ చేసిన విధ్వంసం పోలవరానికి ఆర్థికంగా నష్టాన్ని చేకూర్చింది.

ప్రధాన డ్యాంలోని కీలకమైన కట్టడాలు దెబ్బతినడంతో పునర్ నిర్మాణానికి డిజైన్ల కోసం ఈ ఏడాది చివరి వరకు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. పోలవరం ప్రధాన కట్టడాలు దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ పునర్ నిర్మాణ పనులు డిజైన్లను ఆమోదించడం కోసం అంతర్జాతీయ నిపుణులను కేంద్ర జలశక్తి శాఖ గుర్తించింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. అయితే పీపీఏ వారికి ఇంకా నియామక ఉత్తర్వులను ఇవ్వలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఈ నిపుణులకు నియామక పత్రాలను ఈ నెలఖరులోగా ఇచ్చే వీలుందని జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. వారిని నియమిస్తేనే పలు డిజైన్లకు ఆమోద ముద్ర పడుతుంది.

అయితే వీరు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి.. జరుగుతున్న పనులను సమీక్షించి డిజైన్లను పరిశీలించి ఆమోదిస్తారు. ఇందుకు చాలా సమయం పడుతుంది. దీంతో పనులు మరింత జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. డయా ఫ్రం వాల్ డిజైన్లను సెప్టెంబరు నెలాఖరు నాటికి ఆమోదించే వీలుందని రాష్ట్ర  ప్రభుత్వం చెబుతోంది. డైనమిక్ ఎనాలసిస్, భూకంప తీవ్రతను తట్టుకునే సామర్థ్యం అధ్యయన నివేదిక  డిసెంబరు 31 నాటికి వస్తుందన్నారు. ఇలా ప్రధాన డ్యాంకు సంబంధించిన డిజైన్లన్నీ వచ్చేందుకు ఈ ఏడాదంతా ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: