టీడీపీ టార్గెట్ లిస్ట్‌: చంద్రబాబు నాటిన మొక్క విడదల రజనికి పగలే చుక్కలు?

Suma Kallamadi
* నాడు చంద్రబాబు నాటిన మొక్క
* నేడు వైసీపీలో చేరి చంద్రబాబును ద్రోహి అన్నారు
* విడుదల రజనిపై టీడీపీ స్పెషల్ టార్గెట్
(ఏపీ- ఇండియా హెరాల్డ్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే 2019లో అధికారంలోకి రాగానే జగన్ చంద్రబాబు భవనాలను కూల్చేయడం, టీడీపీ నేతలను అరెస్టు చేయించి జైలుకు పంపించడం చేశారు. కక్ష సాధింపు చర్యలు తీసుకోవడంలో ఆయన ఏమాత్రం వెనకాడ లేదు. చివరికి ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించారు. ఇన్ని విధాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ కూడా అదే విధంగా వైసీపీ వాళ్లకి చుక్కలు చూపించాలని చూస్తోంది. విమర్శల ద్వారానే కాకుండా కేసులతో కూడా ఇబ్బంది పెట్టాలని లోకేష్ చూస్తున్నారు. ఆల్రెడీ ఆయన ఎర్రబుక్కు కూడా తయారు చేశారు.
వాటిలో ఎవరి పేర్లు చేర్చారు కానీ ఒక్కొక్కరికి మాత్రం ముడినట్లే ఉంది ఇప్పటికే కొడాలి నానిపై టార్గెట్ పెట్టారు. రకరకాల రంగాల్లో జరిగిన అవినీతులను బయట పెడుతూ అందరినీ కూడా జైలుకు పంపించే మార్గాలు తెరుస్తున్నారు. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజని కొంచెం అతి చేశారు. ఆమె గడిచిన ఐదేళ్లలో ఆరోగ్య, సంక్షేమ & వైద్య విద్య శాఖ మాజీ మంత్రిగా చేశారు. రోజా తర్వాత మీడియాలో ఎక్కువగా కనిపించిన వైసీపీ నాయకురాలు ఎవరైనా ఉన్నారంటే విడదల రజని అనే చెప్పుకోవాలి. ఈమె చాలా ఎమోషనల్ గా కూడా స్పీచ్‌లు ఇస్తుంటారు.
ఒకప్పుడు టీడీపీ వైపు ఉన్నప్పుడు తాను చంద్రబాబు సైదరాబాద్‌ లో నాటిన మొక్క అంటూ చాలా పొగిడేసింది. చంద్రబాబు వల్లే తాను వెయ్యి కోట్ల కంపెనీని స్థాపించానని, వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు దేవుడు అన్నట్లు మాట్లాడారు కానీ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాక చంద్రబాబు చాలా పెద్ద మోసగాడు అని మాట్లాడారు. వైసీపీలో చేరాక జగన్ మాత్రమే దేవుడు అని ఆమె ఎమోషనల్ స్పీచ్ లు ఇచ్చారు. చంద్రబాబు జైలుకు పోతే రోజా, రజనీ వీళ్లు పండుగ చేసుకున్నట్లు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే చంద్రబాబు విడుదల రజిని ఎన్నికల ప్రచార సమయంలోనే బాగా టార్గెట్ చేశారు. ఆమె చీటీ చినిగిపోయిందని, అధికారంలోకి వచ్చాక ఇంకా చిరిగిపోతుంది అన్నట్టుగా మాట్లాడారు. అదే జరగబోతుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: