చెత్త ఏరుకునే మహిళకు.. అయోధ్య రామ మందిర ఆహ్వానం?

praveen
కొన్ని దశాబ్దాల నుంచి భారతదేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కన్న కల మరికొన్ని రోజుల్లో నెరవేరబోతుంది అన్న విషయం తెలిసిందే. హిందువులందరూ ఎంతో భక్తితో కొలిచే శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో ఏకంగా ఆ భగవంతుడి కోసం ఒక సుందరమైన గుడి నిర్మాణం జరిగింది. ఇక ఈ గుడి నిర్మాణం కోసం ఎన్నో రోజులపాటు సుప్రీంకోర్టులో హిందువులందరూ పోరాటం కొనసాగించారు. చివరికి సుప్రీంకోర్టులో హిందువులకు అనుకూలంగా తీర్పు రావడంతో ఇక అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ రామమందిరం పూర్తిగా ఈనెల 22వ తేదీన ఏకంగా శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోతుంది.

అంగరంగ వైభవంగా ఈ విగ్రహ ప్రతిష్టాపన వేడుకను జరిపేందుకు అటు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఈ మహత్తర కార్యక్రమానికి ఎంతోమంది సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందుతూ ఉండడం గమనార్హం. అయితే ఇక అయోధ్యలో రామ మందిర లో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఏకంగా ఒక పారిశుద్ధ్య కార్మికురాలికి ఆహ్వానం అందింది. ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అదేంటి దేశంలో లక్షల మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండగా కేవలం ఒక్క కార్మికురాలికి మాత్రమే ఎందుకు ఇలా అయోధ్య నుంచి ఆహ్వానం అందింది అనుకుంటున్నారు కదా.

 అయితే ఇలా సదరు పారిశుధ్య కార్మికురాలికి ఆహ్వానం అందడానికి వెనుక పెద్ద కారణమే ఉంది. ఛత్తీస్గఢ్ కు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలైన బిహువ భాయి చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. అయితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఏడాది క్రితం ఏకంగా 20 రూపాయలు విరాళంగా ఇచ్చింది సదరు మహిళ. రోజుకు 40 నుంచి 50 రూపాయల వరకు సంపాదించే సదరు మహిళ.. స్వయంగా 20 రూపాయలను బజరంగ్ దళ్  కార్యాలయానికి వెళ్లి విరాళంగా ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె మంచి మనసుకు అరుదైన గౌరవాన్ని దక్కిది. ఈనెల 22న జరగబోయే రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ఆమెకు విహెచ్పి నుంచి ఆహ్వానం అందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: