రైల్వే ప్రయాణికులకు.. అదిరిపోయే గుడ్ న్యూస్?

praveen
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన 4వ దేశంగా కొనసాగుతున్న భారత్లో ప్రతిరోజు జరిగే రైల్వే ప్రయాణాల సంఖ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది ఎలా అయితే ప్రతిరోజు ఆర్టిసి బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారో.. ఇక కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు జీవితాల్లో రైల్వే ప్రయాణం అనేది రోజువారి జీవితంలో ఒక భాగంగా మారిపోతూ ఉంటుంది. అయితే అతి తక్కువ ధరతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు రైల్వే ప్రయాణం ద్వారా సదుపాయం అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఇక రైలు ద్వారా గమ్యస్థానాలకు చేరడానికి ఎక్కువగా ఆసక్తిని చూపుతూ ఉంటారు.

 అయితే లాంగ్ జర్నీలు చేసేవారు.. సైతం ఇలా రైల్వే ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా రైలు ప్రయాణాలు చేసే అందరికీ కూడా మరింత సులభతరమైన జర్నీని అందించడమే లక్ష్యంగా భారత రైల్వే శాఖ ఎన్నో సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను ఆధునికరణ చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే టికెట్ బుకింగ్, ఫిర్యాదులు, పిఎన్ఆర్ స్టేటస్ లాంటి విషయాల్లో అటు ప్రయాణికులకు  ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక ఇప్పుడు మరో సరికొత్త ఆలోచనకు స్వీకారిం చుట్టింది అన్నది తెలుస్తోంది .

 ఇది నిజంగా రైల్వే ప్రయాణికులు అందరికీ కూడా ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. మొన్నటి వరకు టికెట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలి.. ఇక ఫిర్యాదులు ఎక్కడ చేయాలి? పిఎన్ఆర్ స్టేటస్ ఎక్కడ తెలుసుకోవాలి తెలియక ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. అయితే ఇలా రైలు సంబంధిత అన్ని సేవలను కలిపి సూపర్ యాప్ పేరిట ఒకే యాప్ లో అందించబోతుంది భారత రైల్వే శాఖ. దీనికోసం 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది అనేది తెలుస్తుంది. వచ్చే మూడేళ్లలోపు ఇది అందుబాటులోకి రావచ్చట. అయితే ప్రస్తుతం ఐఆర్సిటిసి  యాప్ అప్పుడప్పుడు లాగ్ అవుతుండగా ఇక కొత్త సూపర్ యాప్ మాత్రం సూపర్ ఫాస్ట్ గానే ఉండబోతుందిఅని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: