జనసేన సత్తా సూపర్‌.. ఈ వింత రికార్డు తెలుసా?

Chakravarthi Kalyan
నాయకుల్ని అందించడం వేరు. పార్టీ అధ్యక్షులను తయారు చేయడం వేరు. తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వం విషయంలో టీడీపీ ఒక మాట చెబుతూ  ఉంటుంది.  తెలుగు రాష్ట్రాలకు నాయకత్వం అందించింది మా పార్టీయే నని గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. ఎంతో మంది నాయకుల్ని తయారు చేసింది టీడీపీయేనని.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మా వాడే..  అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం మా వాడే. తెలంగాణకు ఇద్దరు సీఎంలను అందించిన ఘనత టీడీపీ సొంతం అంటూ ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.


ఉమ్మడి ఏపీని సుదీర్ఘకాలం పాలించిన వ్యక్తిగా చంద్రబాబుకి గుర్తింపు ఉంది. ఆయన పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీయే.  ప్రస్తుత సీఎం జగన్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే. కేసీఆర్ తొలినాళ్లలో కూడా హస్తం పార్టీలో కొనసాగిన వారే. ఈ లెక్కన చూసుకుంటే తెలంగాణ, ఏపీని పాలించిన సీఎంలలో ముగ్గురిని అందించింది కాంగ్రెస్ పార్టీ.


అలాగని వారు చెప్పుకోవడం లేదు. పార్టీలు అన్నాక నాయకులు తయారు అవుతూ ఉంటారు. కాకపోతే దానిని పార్టీ గొప్పగా చెప్పుకోవడం టీడీపీకే చెల్లింది. అయితే  ఈ లెక్కన జనసేన కూడా ఎంతో మంది నాయకులును తయారు చేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. దీనిని ఓ సారి పరిశీలించండి.


ఏపీ బీర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన నేతే.  అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా యాక్టివ్ గానే పనిచేశారు. ఆ మధ్యన కొత్త పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ సైతం పూర్వాశ్రమంలో జనసేనలో పనిచేశారు. గత ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై పోటీ చేశారు. తాజాగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. ఈయన సైతం జనసేనలో పని చేసిన వారే. ఎన్నికల అనంతరం పార్టీని వీడి సొంత పార్టీని స్థాపించారు. ఈ లెక్కన జనసేన కూడా ఆషామాషీ పార్టీ కాదు. పార్టీ ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం అవుతున్నా.. అధికారంలోకి రాకున్నా.. ఎంతో మంది నేతలను జాతికి అందించిన ఘనత మాత్రం జనసేన పార్టీకి దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: