ప్రపంచమంతా పాలస్తీనావాసులకు కష్టకాలం..?

Chakravarthi Kalyan
నాయకుడు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్దంలో దాదాపు ఇప్పటి వరకు 11 లక్షల మంది పాలస్తీనీయులు వేరే దేశాలకు వెళ్లిపోతున్నారు. పాకిస్థాన్ సిటీలో ఇద్దరు పాలస్తీనా ఇద్దరు స్టూడెంట్లను వేధించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆరుగురుపై కేసు నమోదైంది. పాలస్తీనా విద్యార్థులు ఇద్దరు పాకిస్తాన్ లో చదువుకోవడానికి వస్తే అక్కడ ఉన్న కొంతమందిని వారు వేధించడంతో వారిని ప్రశ్నించడంతో మరి కొంతమంది పాలస్తీనా విద్యార్థులపై కత్తులతో దాడి చేశారు.

దీంతో పాలస్తీనా వాసులు ఎక్కడికి వెళ్లినా వారికి ఎదురుదాడే అవుతుందని అనుకుంటున్నారు. అయితే ఇజ్రాయిల్ పై హమాస్ చేసిన నరమేధం వల్ల ప్రస్తుతం గాజాలో ఇజ్రాయిల్ బాంబులతో విరుచుకుపడుతోంది. దీంతో గాజాను వదిలి దాదాపు 10 లక్షల మంది ఇప్పటికే వలస వెళ్లిపోతున్నారు. గాజాలో ఎక్కడ చూసిన నేలమట్టం అయినా భవనాలు, శిథిలాల కుప్పలే కనిపిస్తున్నాయి. ఇలా గాజాలో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి.

పాలస్తీనా వాసులు ఈజిప్టులోకి వెళ్లాలంటే అక్కడి దేశం వారు సరిహద్దులు తెరవడం లేదు. ఇక్కడ ఉంటే పరిస్థితి లేదు. గాజాలో తాగడానికి నీరు, తినడానికి తిండి, ఉండడానికి చోటు లేక బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. అయితే ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ ఆదేశించింది. హమాస్ ఉగ్రవాదులు మాత్రం ప్రజలు దక్షిణ గాజాకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఇజ్రాయిల్ గాజాపై దాడులు కొనసాగిస్తుండడంతో అక్కడ నీరు, తిండి దొరక్క సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు.

అయితే పాలస్తీనా వాసులు విదేశాల్లో కూడా అక్కడక్కడ ఉన్నారు. వారిపై కూడా ఆయా దేశాల్లో దాడులు జరుగుతున్నాయి. పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు నిరసనలు చేస్తున్నప్పుడు వారికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. గాజాలో దాడులు ఆపమని ఐక్యరాజ్య సమితి ఇజ్రాయిల్ ను కోరుతుంది. బందీలుగా పట్టుకెళ్లిన వారిని విడిచి పెడితేనే దాడులు ఆపుతామని ఇజ్రాయిల్ చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: