ఓట్లు రాకున్నా.. సీట్లు మావే.. చిత్రమైన ఫలితాలు?
అంటే ఘోర పరాజయం పాలు అవుతుంటారు. అయితే ఇక్కడ గెలవడం ఓడిపోవడం అనేది ప్రజలకు తమపై ఉండే అభిప్రాయాన్ని బట్టి కూడా ఉంటుంది. గెలిచిన పార్టీకి ఒక్కో సారి ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు తక్కువ వస్తూ ఉంటాయి. మరొక సారి సీట్లు ఎక్కువ వచ్చి ఓట్లు తక్కువ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మొన్న కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి చూస్తే ఓట్లు తక్కువ వచ్చాయి. కానీ సీట్లు ఎక్కువ వచ్చాయి.
అదే కర్ణాటకలో 2018లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చాయి, కానీ సీట్లు తక్కువ వచ్చాయి. అదే ప్రస్తుతం అయితే ఓట్లు, సీట్లు రెండు సమానంగానే వచ్చాయి. అంటే ఎక్కువగానే వచ్చాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్ కు రెండు శాతం ఓట్లు ఎక్కువ వచ్చాయి. కానీ సీట్లు మాత్రం దాదాపు 100వరకు తగ్గిపోయాయి. పార్టీల పరంగా చూస్తే ఒకప్పటి కాంగ్రెస్ స్థానంలోకి బిజెపి వస్తే, భారతీయ జనతా పార్టీ ప్లేస్ లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది.
దానితో భారతీయ జనతా పార్టీ మిగిలిన మిత్ర పక్షాలందరితో కలిసి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ కూడా మిత్రపక్షాలు అందరితో కలిసి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుంది. 1991ఎన్నికల్లో కాంగ్రెస్ కు 36%, బిజెపికి 20శాతం ఓట్లు వచ్చాయి. అయితే 2019ఎన్నికల్లో ఈ లెక్క తిరగబడిందని తెలుస్తుంది. ఈ రకమైన పజిల్ వంటి ఫలితాల మధ్య సరిగ్గా అప్పుడే మోడీ యుగం కూడా మొదలైంది.