శరద్ పవార్ : 4 సార్లు ముఖ్యమంత్రి.. మట్టి కరిచిన మరాఠా యోధుడు.. ?
ఫలితాలు కూడా బిజెపి కూటమికి అనుకూలంగా రావడం జరిగింది. ఇందులో బిజెపి 132 స్థానాలు దక్కించుకొని లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక రెండు రోజుల్లో ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపైన క్లారిటీ రానుంది. అయితే ఇదంతా పక్కకు పెడితే... మహారాష్ట్ర ఎన్నికల్లో... మొదటిసారిగా శరద్ పవార్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మరాటి యోధుడు.... శరద్ పవార్ కు చెందిన ఎన్సిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది.
ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 86 స్థానాల్లో ఎన్సిపి పార్టీ పోటీ చేయడం జరిగింది. అయితే ఇందులో కేవలం పది స్థానాలు మాత్రమే గెలుచుకొని... చతికల పడింది. అదే సమయంలో అజిత్ పవార్ చేతిలో ఉన్న ఎన్సిపి 59 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 41 స్థానాలు గెలవడం జరిగింది. శరద్ పవార్ కంచుకోట ఆయన బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా... గ్రాండ్ విక్టరీ కొట్టారు అజిత్ పవార్.
బారామతి లోక్సభ నియోజకవర్గంలో... ఎంపిగా శరద్ పవార్ కుమార్తె ఉన్నా కూడా అక్కడ ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. అంతే కాకుండా ఎన్సిపి తరపున పోటీ చేసిన శరత్ పవార్ మనవడు యుగేంద్ర పవార్ కూడా ఓడిపోయాడు. మొన్న లోక్సభ ఎన్నికల్లో శరద్ పవార్ పార్టీ ఏకంగా 10 స్థానాల్లో పోటీ చేస్తే 8 సీట్లు గెలుచుకుంది. కానీ అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి అట్టర్ ఫ్లాప్ అయింది శరద్ పవార్ పార్టీ.