మహారాష్ట్రలో ఆ నేతలకు చుక్కలు చూపిస్తున్న బీజేపీ.. వాళ్లకు ఇబ్బందేనా?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న కష్టం అంతాఇంతా కాదు. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యూహంతో బీజేపీ తెలివిగా అడుగులు వేస్తోంది. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బలం పెంచుకుంటూ ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేస్తోంది. మహారాష్ట్రలో కొంతమంది నేతలకు చుక్కలు చూపించే దిశగా బీజేపీ అడుగులు వేస్తుండటం గమనార్హం.
షిండే, అజిత్ లకు ఎన్నికల ముందు వరకు ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ ఇప్పుడు మాత్రం వాళ్లను కేర్ చేయడం లేదు. బీజేపీకి చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం దక్కడంతో ఆ పార్టీ ఇప్పుడు తెలివిగా వ్యవహరిస్తోంది. బీజేపీ మహారాష్ట్రలో ఫడ్నవీస్ ను సీఎం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంలో మరో అభిప్రాయానికి తావు లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
మహారాష్ట్ర రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మాత్రం శరవేగంగా మారిపోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాలు మాత్రం మామూలుగా లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రావడంతో దేశంలో మోదీ హవా ఇంకా తగ్గలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర రాష్ట్రం దేశంలోని ప్రధాన రాష్ట్రాలలో ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
2027లో ఎన్నికలు జరిగినా 2029లో ఎన్నికలు జరిగినా బీజేపీనే మరోసారి అధికారంలోకి రావడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీకి పట్టు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని చెప్పవచ్చు. కేంద్రంలో బీజేపీ కూటమికి తిరుగులేదని చాలా సందర్బాల్లో ప్రూవ్ అవుతూ వస్తోంది. నరేంద్ర మోదీ పీఎంగా అరుదైన ఘనతలను సొంతం చేసుకుంటున్నారు. మహారాష్ట్ర రాష్ట్ర ఫలితాలు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మహారాష్ట్ర ఫలితాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి.