తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన హాస్య నటుదిగౌ గుర్తింపును సంపాదించుకున్న వారిలో మల్లికార్జున రావు ఒకరు. పాఠశాల దశనుంచే ఈయన నాటకాల్లో నటించే వారు. 50 నుంచి 60 నాటకాలు , ఏకపాత్రాభినయం పాత్రలూ ఆయనకు నటన మీద అద్భుతమైన పట్టు లభించే దానికి దోహదపడ్డాయి. దివంగత నటులు రావు గోపాలరావు సహకారంతో ఈయన సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. 1972 లో తులసి అనే అనే సినలో చిన్న వేషం వేశారు. ఆ సమయం లోనే పార్వతీ పరమేశ్వరులు మూవీకి సహాయ దర్శకుడిగా పని చేశారు. తరువాత నాగమల్లి లాంటి కొన్ని సినిమాల్లో నటించారు. వంశీతో ఏర్పడ్డ పరిచయం ఈయన సినీ జీవితాన్ని మార్చేసింది.
వంశీ మొదటి చిత్రం మంచు పల్లకీలో మల్లికార్జున రావు చిన్న పాత్ర పోషించారు. అన్వేషణ మూవీలో పులిరాజుగా మల్లికార్జునరావు నటన చిత్రసీమను ఆకట్టుకొంది. అదే సమయంలో తన తండ్రి అస్వస్థతకు లోనైతే అనకాపల్లి వెళ్లడం వల్ల ఆయన అవకాశాలు కోల్పోయారు. లేడీస్ టైలర్ మూవీలో బట్టల సత్యం పాత్ర తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 350కి పైగా మూవీలలో నటించారు. తమ్ముడు మూవీ కి ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును పొందారు. మల్లికార్జున రావు తన కెరియర్లో ఎక్కువ శాతం వంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమాలలో నటించాడు. అలాగే వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలలో ఈయనకు అద్భుతమైన పాత్రలు లభించడంతో ఈయన వంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఏప్రిల్ ఒకటి విడుదల , కనకమాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ట్రూపు , హలో బ్రదర్ , ఆలీబాబా అరడజను దొంగలు , ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు , బద్రి , ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు , ఎవడి గోల వాడిది , మా ఆయన సుందరయ్య సినిమాలు ఆయనకెంతో మంచి పేరును తీసుకొచ్చాయి.
ఇక తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మల్లికార్జున రావు 57 సంవత్సరాల వయసులో 24 జూన్ 2008 వ సంవత్సరం మరణించారు. ఇక ఈయన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈయనకు ఇప్పటికి కూడా మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో ఉంది.