గోవాలో రచ్చ రచ్చ చేసిన.. రజనీకాంత్ విలన్.. వీడియో వైరల్?
ప్రముఖ నటుడు వినాయకన్ "జైలర్" సినిమాలో రజినీకాంత్‌కు దీటుగా ప్రతి నాయకుడి పాత్రను పోషించి చాలామంది ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అయితే సినిమాల్లోనే కాదు ఇతను బయట ట్రబుల్ మేకర్ అని తెలుస్తోంది. రీసెంట్‌గా గోవాలో ఒక గొడవకు దిగి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో వినాయకన్ ఒక దుకాణదారుతో వాగ్వాదానికి దిగి రోడ్డు మీద గొడవ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ వీడియోలో వినాయకన్ సాదాసీదా దుస్తులు ధరించి, చేతులు వెనుక కట్టుకొని దుకాణం ముందు నిలబడి, వణుకుతూ మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. కొంతమంది ఆయన మద్యం మత్తులో ఉన్నారని అనుమానిస్తుండగా, మరికొందరు ఆయన ఒక సినిమా కోసం నటిస్తున్నారని భావిస్తున్నారు.
వినాయకన్ గోవాలో జరిగిన ఈ ఘటనపై సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్లు వస్తున్నాయి. ఒక నెటిజన్, 'ఆయన మత్తులో ఉన్నారో లేక మానసిక సమస్యలతో పోరాడుతున్నారో అర్థం కావడం లేదు. ఇది అస్సలు బాగా లేదు' అని వ్యాఖ్యానించారు. మరొకరు, 'ఆయన మద్యం తాగి ఉంటారు' అని అనుమానించారు. మరొకరు, 'ఆయన జీవితం అదుపుతప్పి పోతోంది. ఆయనకు వెంటనే సహాయం అవసరం' అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకొకరు, 'ఆయన మత్తులో ఉన్నట్లయితే, ఇంతటి ప్రతిభ వృథా అవుతున్నందుకు చాలా బాధగా ఉంది' అని విచారం వ్యక్తం చేశారు.
వినాయకన్ ఇలాంటి వివాదాల్లో ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్‌లో విమానాశయ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ కె. బాలరాజు ప్రకారం, వినాయకన్ మద్యం మత్తులో ఉండి ఎయిర్‌పోర్ట్ గేట్ల వద్ద గొడవ చేశారు. సిఐఎస్‌ఎఫ్ ఆయనను పోలీసులకు అప్పగించింది. పోలీసులు సిటీ పోలీస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, వినాయకన్ తాను బొత్తిగా అమాయకుడినని ప్రకటించి, 'ఎందుకు అరెస్టు చేశారో నాకు అర్థం కావడం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. సీసీటీవీ ఫుటేజ్ ఇది నిరూపిస్తుంది' అని అన్నారు. 2023లో కేరళలోని ఎర్ణాకుళం నార్త్ పోలీస్ స్టేషన్ వద్ద గొడవ చేసి అరెస్ట్ అయ్యారు. ఆయన మద్యం మత్తులో ఉండి పోలీసులపై అసభ్య పదజాలం వాడాడని నివేదికలు వెల్లడించాయి. ఇలాంటి ఘటనలు పదేపదే జరగడంతో నటుడి ప్రవర్తనపై ఆందోళన వ్యక్తమవుతోంది.
https://x.com/AbGeorge_/status/1859933225080193188