పాక్‌పై ఇండియా మరో సర్జికల్‌ స్ట్రైక్?

Chakravarthi Kalyan
దేశ సరిహద్దుల్లో ఏదో జరిగిందనే టాక్ నడుస్తోంది. గతంలో సర్జికల్ 1, 2 జరిగినపుడు దేశం మొత్తం గర్వగా ఫీలయింది. దేశ సైనికులపై దొంగచాటుగా దాడి చేసి చంపిన ఉగ్రవాదులను పాక్ లోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్ చేసి మరీ మట్టుబెట్టారు. అయితే ప్రస్తుతం మరో పోస్టు వైరల్ అవుతోంది. ఇండియా మళ్లీ సర్జికల్ స్ట్రైక్ చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

శనివారం అర్ధరాత్రి 12 నుంచి 15 మంది సైనికులు పీవోకే బార్డర్ లోకి వెళ్లి అక్కడ అక్కడ ఉన్న ఉగ్రవాదులకు చెందిన లాంచింగ్ ప్యాడ్ లను ధ్వంసం చేసి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆపరేషన్ లో 7 నుంచి 8 మంది తీవ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. పాక్ తీవ్రవాదులకు శిక్షణ ఇచ్చి వారితో భారత్ లో దాడులు చేయించాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తుందనే పక్కా సమాచారంలో పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని నట్వాల్ కొట్వా ప్రాంతంలో దాగి ఉన్న తీవ్రవాదులను సర్జికల్ స్ట్రైక్ తో మరో సారి మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై ఇండియన్ ఆర్మీ పక్కా ప్రణాళికతో ఈ దాడి చేశారని తెలుస్తోంది. పూంచ్ లో సైనికుల మీద దాడి జరిగిన ఘటనకు సంబంధించి ఈ విధమైన సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో భారీ ఉగ్రదాడులకు ప్రయత్నాలు జరుగుతున్న దృష్ట్యా సైన్యం తీవ్రవాదుల సమాచారాన్ని పక్కాగా సేకరించుకుని అర్ధరాత్రి సర్జికల్ స్ట్రైక్ చేశారని అంటున్నారు. అయితే దీన్ని ప్రభుత్వం ఇప్పటి దాకా అధికారికంగా ప్రకటించలేదు.

సోషల్ మీడియాలో వస్తున్న ఊహగానాలు మాత్రమే. మరి దీనిపై ఇండియా గవర్నమెంట్ ఏం సమాధానం చెబుతుందోనని అందరూ వేచి చూస్తున్నారు. ఒక వేళ ఇది ఫేక్ న్యూస్ అయితే ఇలాంటి న్యూస్ లు క్రియేట్ చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: