అమరావతి : వైసీపీ ఎంఎల్ఏ పరిస్ధితి ఇలాగైపోయిందా ?

Vijaya


పాపం ఈ మహిళానేత పరిస్ధితి ఇలా దయనీయంగా తయారైపోయిందట. అదేదో మోటు సామెతలో చెప్పినట్లు ఎంఎల్ఏగా గెలిచిన సొంతపార్టీ వైసీపీ బయటకు పంపేసింది. చేరుదామని అనుకున్న టీడీపీలో ఎంట్రీ చాలా కష్టంగా ఉందట. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచక చివరి ప్రయత్నంగా ఉత్తరాంధ్ర బాట పట్టారు. ఇంతకీ విషయం ఏమిటంటే 2019 ఎన్నికల్లో రాజధాని నియోజకవర్గం తాడికొండ నుండి పోటీచేసి గెలిచారు. అయితే గెలిచిన దగ్గర నుండి ఎక్కువకాలం ఏదో ఒక వివాదంలో నలుగుతునే ఉన్నారు.



ఇసుక అక్రమ తవ్వకాలని, ఇసుక లారీలను విడిపించుకోవటమని, వసూళ్ళు చేస్తున్నారని, ఆమె అసలు ఎస్సీనే కాదని..ఇలా చాలా వివాదాల్లో కూరుకుపోయారు. చివరకు పార్టీలోని తన వ్యతిరేకులపై కేసులు పెట్టించటం ఎక్కువైపోవటంతో పార్టీలో తిరుగుబాటు వచ్చేసింది. ఆమెకు ప్యారలెల్ గా ప్రత్యర్ధులు బలంగా తయారయ్యారు. ఈ నేపధ్యంలోనే క్రాస్ ఓటింగ్ వివాదంలో తగలుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వనని చెప్పేయటంతో ఎంఎల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు.



చివరకు ఈ క్రాస్ ఓటింగ్ కారణంతోనే ఆమెను పార్టీలో నుండి జగన్ సస్పెండ్ చేసేశారు. క్రాస్ ఓటింగ్ చేయటానికి ముందుగానే ఆమె టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో మాట్లాడుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. సరే అవన్నీ పాత విషయాలు అనుకుంటే వైసీపీ నుండి సస్పెండ్ అయిన దగ్గర నుండి శ్రీదేవి తెలుగుదేశంపార్టీలో చేరటానికి నానా అవస్తలు పడుతున్నారట. చంద్రబాబుతో మాట్లాడుకుని పార్టీలో చేరటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరటంలేదట.



వాడుకుని వదిలేయటంలో చంద్రబాబును మించినోళ్ళు లేరన్న విషయం ఎంఎల్ఏకి బహుశా ఇప్పటికి అర్ధమయ్యుంటుంది. చంద్రబాబు ఈమెకు ఎందుకు అవకాశం ఇవ్వటంలేదంటే పార్టీలో చేర్చుకున్నా టికెట్ ఇచ్చే అవకాశంలేదు. మాజీ ఎంఎల్ఏ తాడికొండ sravan KUMAR' target='_blank' title='శ్రవణ్ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">శ్రవణ్ కుమార్ అధినేతకు స్ట్రాంగ్ సపోర్టర్. అందుకనే చేర్చుకున్నా టికెట్ ఇవ్వలేని కారణంగానే ఏ విషయమూ చెప్పకుండా దూరం పెడుతున్నారని సమాచారం. అందుకనే ఈమె కూడా ఏ విషయం తేల్చుకునేందుకు చంద్రబాబు పర్యటిస్తున్న ఉత్తరాంధ్రకు వెళ్ళారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరి చివరకు ఏమి తేల్చుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: