జట్టులో అతనెందుకు.. వేటు వేయండి : ఇండియా మాజీ

praveen
గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టైటిల్ గెలవడంలో వెనకబడి పోతున్న టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్, యుఎస్ వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచ కప్ టోర్నీలో మాత్రం తప్పకుండా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు లీగ్ దశలో మూడు మ్యాచ్లు ఆడిన టీమిండియా మూడింటిలో కూడా విజయం సాధించి సూపర్ 8 కి అర్హత సాధించింది. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ లో కీలకమైన మ్యాచ్లు ఆడెందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి.

 అయితే లీగ్ దశ మ్యాచ్ లో కొంత మంది ఆటగాళ్లు విఫలమైన మరి కొంతమంది రాణించడంతో చివరికి టీమిండియా గట్టెక్కగలిగింది. కానీ ఇప్పుడు సూపర్ 8 లాంటి కీలకమైన మ్యాచులలో మాత్రం భారత జట్టులో కీలకమైన మార్పులు చేస్తే తప్ప ప్రయోజనం ఉండదు అంటూ ఎంతో మంది మాజీ ఆటకాలు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ వరల్డ్ కప్ లో పెద్దగా బౌలింగ్ చేయని ఆల్ రౌండర్ శివం దుబే జట్టులో కొనసాగించడం ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే సూపర్ 8 మ్యాచ్లకు వెస్టిండీస్ వేదిక అవుతుంది. అక్కడి పిచ్ లు బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటాయి.  ఎక్స్ ట్రా స్పెషలిస్ట్ బ్యాటర్ తో బరిలోకి దిగాలనిమాజీ ప్లేయర్లు సూచిస్తున్నారు.

 ఇక ఇటీవల ఇదే విషయంపై కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శివం దూబేకీ బదులు మిడిల్ ఆర్డర్లో సంజును ఆడించాలి. దూబే బౌలింగ్ చేయనప్పుడు సంజు బెటర్ ఆప్షన్. ఎందుకంటే పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయగలడు. అంతేకాకుండా పవర్ హిట్టింగ్ తో క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలడు. న్యూయార్క్, బార్బడోస్ ఏ మైదానం అయినా టీమిండియా ఎక్స్ ట్రా బ్యాటర్ గా సంజు శాంసన్ పనికి వస్తాడు. ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన పరిస్థితుల్లో కూడా సంజూ జట్టును ఆదుకోగలడు. హార్థిక్ పాండ్యా, జడేజాలాగా దూకుడుగా బ్యాటింగ్ చేయగలడు అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: