భారత్‌లో చైనా పెట్టుబడులకు రంగం సిద్ధం?

Chakravarthi Kalyan
టెస్లా వాడు ఇక్కడ తన కారు అమ్మాలంటే దాన్ని ఇక్కడ తయారైనా చేయాలి. లేదంటే స్పేర్ పార్ట్స్ అయినా ఇక్కడికి తీసుకు వచ్చి కలపడం అయినా జరగాలి. ఇది భారత దేశం యొక్క నిబంధన. అయితే వీరి నిబంధనకు టెస్లా వాడు ముందు కుదరదు అని చెప్పినా కూడా ఇప్పుడు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే అమెరికాకు సంబంధించిన ఫేస్ బుక్, అమెజాన్ ఇవన్నీ కూడా భారతదేశంలో తమ కంపెనీలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా తమ దేశానికి సంబంధించిన చట్టాలు ప్రకారం పని చేస్తామన్నాయి.


అయితే భారత్ దీనికి ఒప్పుకోలేదు. మా చట్టాల ప్రకారం పని చేస్తేనే ఇక్కడ తమ కంపెనీలను నిర్వహించుకోవడానికి వీలు ఉంటుందని ఖరాఖండిగా చెప్పేసింది. ఇక్కడ ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవచ్చు కానీ చైనా మాత్రం పెట్టుబడులు పెట్టడానికి వీలులేదని చెప్పింది భారత్. ఎందుకంటే చైనా వల్ల భారత దేశం గతంలో ఎదుర్కొన్న సమస్యలే దీనికి ముఖ్య కారణం అని తెలుస్తుంది.


ఇప్పుడు అసలు భారత్ కు పెట్టుబడులు రావడం లేదని చెప్పే మాటల్లో నిజం లేదని చెప్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. పెట్టుబడులు పెట్టే సమయంలో ఆయా దేశాల డిమాండ్లకు, భారత దేశపు రిక్వైర్మెంట్స్ కు మధ్య వచ్చే వ్యత్యాసం వల్ల కొన్ని పెట్టుబడులైతే జరగడం లేదని వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ట్యాక్స్ ఎగ్జెమ్ప్షన్ ఉండదని భారత్ ఆల్రెడీ ఈ పెట్టుబడులు పెట్టే దేశాలకు చెప్పింది.


ఏ దేశపు కంపెనీలైనా భారత దేశంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు, లాభాలు పొందవచ్చు.  కానీ ఆ కంపెనీలు భారతదేశపు చట్టాల ప్రకారం పనిచేయాలి. ఇదే పెట్టుబడిదారులకు భారత్ పెట్టే నిబంధన. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్ ఈ నిబంధనలను పెట్టుకొచ్చింది. ఈ నిబంధనలకు కనుక ఓకే అంటే చైనా కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టుకోవచ్చు అని కూడా చెప్తుంది భారత్ ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: