అమరావతి : వైసీపీ దెబ్బకు జనసేన మాయమైపోతుందా ?
రాబోయే ఎన్నికలు రాజకీయంగా ఏపీ ముఖచిత్రాన్ని మార్చేస్తాయని చాలామంది అనుకుంటున్నారు. వచ్చేఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటుందో ఏ పార్టీ ఉండదో తేలిపోతుంది. మహాభారతంలో భీముడు, దర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు గురించి శ్రీకృష్ణుడు ఒక విషయం చెబుతాడు. వీళ్ళలో ఎవరైతే మొదటి ఎవరిని చంపుతాడో మిగిలిన ముగ్గురు కూడా అతనిచేతిలోనే మరణిస్తారని. ఇపుడు రాష్ట్రంలో పార్టీల పరిస్ధితి కూడా దాదాపు అలాగే అయిపోయింది.
వినటానికి కాస్త ఓవర్ గా ఉన్నా పరిస్ధితి అయితే అలాగే అనిపిస్తోంది. ఎలాగంటే రాబోయే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణం లాంటిది. ఎన్నికల్లో వైసీపీ గనుక మళ్ళీ గెలిస్తే ముందుగా దెబ్బపడేది టీడీపీ మీదే. తెలుగుదేశం గెలవకపోతే తెలంగాణాలో పార్టీ పరిస్ధితి లాగే అయిపోతుంది. అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు లేరంటే తర్వాత పార్టీ పరిస్ధితి ఏమిటో ఎవరు చెప్పలేరు. ఇదే సమయంలో జనసేన కనుమరుగైనా ఆశ్చర్యంలేదు. అంటే వైసీపీ గెలిస్తే టీడీపీ, జనసేన దాదాపు నేలమట్టమైపోతాయి.
అదే టీడీపీ గెలిస్తే ముందు జనసేన నిర్వీర్యమైపోతుంది ఎందుకంటే జనసేనలోని నేతల్లో అత్యధికులు రాజకీయాల నుండి తప్పుకుంటారు. మిగిలిన కొద్దిమంది టీడీపీలో చేరిపోతారు. ఇక వైసీపీని బాగా ఇబ్బంది పెట్టడం ఖాయమే కానీ వయసు రీత్యా జగన్మోహన్ రెడ్డి తట్టుకుని పోరాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వైసీపీ గెలిస్తే టీడీపీని భూస్ధాపితం చేసి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ కలలు కంటోంది. టీడీపీని దెబ్బకొడితే కానీ తాము ప్రధాన ప్రతిపక్షంగా ఎదగలేమని బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.
కాబట్టి వైసీపీ గెలిస్తే టీడీపీని తమపార్టీలో కలిపేసుకోవటానికి బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. అంటే కేంద్రంలో పరిస్ధితుల మీద ఆధారపడుంది. వైసీపీ గెలిస్తే టీడీపీ, జనసేనలు దాదాపు కనుమరుగైపోతాయి. అదే టీడీపీ గెలిస్తే జనసేనకు దెబ్బ, జగన్ కు ఇబ్బంది. బీజేపీకి ఉన్నది లేదు కాబట్టి కొత్తగా పోయేదేమీ లేదు. అందుకనే వచ్చేఎన్నికలు మూడు పార్టీలకు కీలకంగా మారబోతున్నాయి. మరి జనాల తీర్పు ఎలాగుంటుందో చూడాలి.