టీడీపీకి షాక్‌ ఇచ్చిన ఇంగ్లీష్‌ మీడియా సర్వే?

Chakravarthi Kalyan
టైమ్స్ నౌ తెలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురించి రాసుకొచ్చిన ఒక విషయం ఇప్పుడు చర్చకు దారి తీస్తుంది. టైమ్స్ నౌ  రాసుకొచ్చిన ఆ విషయంపై ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు విరుచుకు పడుతున్నట్లుగా తెలుస్తుంది. రాబోయే తొమ్మిది నెలల కాలం నుండి 12 నెలల కాలంలోపు భారత దేశం అంతటా ముఖ్యంగా  తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.

టైమ్స్ నౌ తాను చేసిన సర్వే ప్రకారం తెలంగాణలో టిఆర్ఎస్, ఆంధ్రలో వైఎస్ఆర్సిపి గెలవడం ఖాయం అని చెప్తుంది. ఆ పార్టీలకు ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ ఎక్కువ, నెగటివ్ ఇమేజ్ తక్కువ ఉండడం అనే కారణం వల్ల టైమ్స్ నౌ అంత ధీమాగా తన సర్వే ఫలితాలను వెల్లడించిందని తెలుస్తుంది. అయితే టైమ్స్ నౌ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఈ సర్వే ఫలితాలపై  టిడిపికి సంబంధించిన నీలాయ పాలెం విజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకు పడినట్లుగా తెలుస్తుంది.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం గత ఏప్రిల్ లో ఒక శనివారం టైమ్స్ నౌ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే అనే ఒక సర్వే పెట్టారని ఆయన గుర్తు చేశారు. ఆ సర్వేలో టైమ్స్ నౌ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 24 నుండి 25 స్థానాలు ఇచ్చింది. అప్పుడే మా తెలుగుదేశం పార్టీ మీ టైమ్స్ అఫ్ ఇండియా వైఎస్ఆర్సిపితో చేసుకున్న 8 1/2 కోట్ల ఒప్పందానికి సంబంధించిన జీవోని బయటపెట్టిందని ఆయన గుర్తు చేశారు.

అప్పుడు ఆ న్యూస్ ని డీల్ చేసిన టీం తిరిగి అదే 24-25సీట్లు  ముందు కూడా వస్తాయన్నట్లుగా సంఖ్య కూడా మార్చకుండా ప్రచారం చేస్తారా అంటూ మండి పడుతున్నారు. అదే ఉత్తర భారత రాష్ట్రాల్లో మాత్రం సీట్ల సంఖ్యతో పాటు ఒక్కో పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయో కూడా స్పష్టంగా వివరిస్తారా అంటూ మండిపడుతున్నారు వాళ్ళు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP

సంబంధిత వార్తలు: