అమరావతి : కార్టూన్ వెనుక ఇంత కతుందా ?

Vijaya


చంద్రబాబునాయుడులో లేదా తెలుగుదేశంపార్టీలో ఒరిజినాలిటి దెబ్బతినేసినట్లుంది. ఇప్పటికే రాజమండ్రి మహానాడులో విడుదలచేసిన మొదటివిడత మ్యానిఫెస్టో హామీలన్నీ కాపీయే అని అర్ధమైపోయింది. అందుకనే నెటిజన్లు, మామూలు జనాలు సోషల్ మీడియాలో చంద్రబాబుపైన సెటైర్లు వేస్తున్నారు. ఆ సెటైర్లు తగ్గకముందే టీడీపీ ట్విట్టర్ లో ఒక కార్టూన్ కనిపించింది. ఇది పేదలకు-పెత్తందార్లకు మధ్య పోరాటం అన్న జగన్మోహన్ రెడ్డి కార్డూన్ కు పోటీగా చేసినట్లే ఉంది.



పేదలు-పెత్తందార్ల కార్టూన్లో జగన్ను బాహుబలి స్ధాయిలో ప్రొజెక్టుచేశారు. ఆ విధంగా ప్రొజెక్టయిన కార్టూన్ మొదటిది కాబట్టి జనాలను బాగా ఆకట్టుకుంది. అది బాగా పాపులర్ అయ్యింది కాబట్టి ఆ కాన్సెప్టుతోనే చంద్రబాబును కూడా ప్రొజెక్టు చేస్తు తయారుచేసిన కార్టూన్ కాపీక్యాట్ అయిపోయింది. వైసీపీ పాపులర్ చేసిన కార్టూన్లో జగన్ బాహుబలి రేంజిలో కనబడితే టీడీపీ రూపొందించిన కార్టూన్లో చంద్రబాబు వెనకాల వెలుగులు చిమ్ముతుంటుంది. పౌరాణిక సినిమాల్లో శ్రీకృష్ణుడు విశ్వరూపం దాల్చినపుడు వెనకాల వెలుగులు చూపించినట్లుగా.



కార్టూన్లో కుడివైపున కియా, ఇసుజు, ఫాక్స్ కాన్ లాంటి సంస్ధల హోర్డింగులు కనబడతాయి. కియా అంటే ఒకేనే మరి ఇసుజు, ఫాక్స్ కాన్ తో చంద్రబాబుకు ఏమి సంబంధం ? పరిశ్రమల వెనుక హైరైజ్ భవనాలు కనబడతాయి. బహుశా చంద్రబాబు కడదామనుకుని కట్టలేకపోయిన భ్రమరావతి నిర్మాణాలేమో. పరిశ్రమల హోర్డింగులకు ముందు సోలార్ ప్యానెల్స్ కనబడతాయి. అలాగే పరిశ్రమలకు కుడివైపంతా పచ్చటి పొలాలు, ట్రాక్టర్, పచ్చటి చెట్లున్నాయి. అలాగే ఏపీ లోకేష్ అనే ఎర్రటి అక్షరాలు కనబడతాయి. పరిశ్రమలు, ట్రాక్టర్, పొలాలు, సోలార్ ప్యానెల్స్ కు లోకేష్ అనే అక్షరాలకు ఏమిటి సంబంధమో అర్ధంకావటంలేదు.



ఇక కార్టూన్ మధ్యలో  చంద్రబాబు ముందు కొందరు పేదలు నిలబడుంటారు. అలాగే ఎడమవైపున కొన్ని ఇళ్ళు తగలబడుతుంటాయి. ఇద్దరు, ముగ్గురు కర్రలు పట్టుకుని ఒకడిని చావకొడుతుంటారు. కార్టూన్ ద్వారా టీడీపీ ఏమిచెప్పదలచుకున్నది అంటే జగన్ హయాంలో రాష్ట్రమంతా అల్లకల్లోలమైపోతోందని. ప్రజలు బాగుపడాలంటే చంద్రబాబు ప్రకటించిన భవిష్యత్తుకు గ్యారెంటీయే శరణ్యమని చెప్పారు. మరీ కార్టూన్ జనాలకు ఎంతవరకు ఎక్కుతుందో చూడాల్సిందే.








మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: