ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం..
ప్రభుత్వం ఉద్యోగులకు కరోనా టైమ్లో పెండింగ్లో ఉన్న డియర్నెస్ అలవెన్స్ను చెల్లించే ప్రసక్తి లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ కుండబద్దలు కొట్టేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి.2020 జనవరి 1 నుంచి 2021 జూన్ 30 వరకు డియర్నెస్ అలవెన్స్ అనేది ఉద్యోగుల కు పెండింగ్లో ఉంది. కరోనా కారణంగా ప్రభుత్వం డీఏను నిలుపుదల చేసింది. పరిస్తితులు మళ్లీ గాడిలో పడిన తర్వాత ఈ డీఏ బకాయిలు అందుతాయని ఉద్యోగులు భావించారు..
ఇకపోతే తాజాగా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చేసింది. ఉద్యోగులకు ఈ 18 నెలల డీఏ బకాయిలను చెల్లించేది లేదని స్పష్టం చేసింది. నరేన్ భాయ్ జే రావత్ రాజ్య సభలో డీఏ బకాయిలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. 18 నెలల డీఏ బకాయిలను ఉద్యోగులకు చెల్లిస్తుందా? లేదా.. అని ప్రశ్న లెవనెత్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 18 నెలల డియర్నెస్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలనే ప్రతిపాదనలు తమ వద్దకు వచ్చాయని తెలిపారు.. డియర్నెస్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలనే ఉద్దేశం ప్రభుత్వాని కి లేదని స్పష్టం చేశారు. ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.. కరోనా టైమ్లో మాత్రం డియర్నెస్ అలవెన్స్ పెరగలేదు. మూడు సార్లు స్థిరంగానే కొనసాగింది. అందుకే ఉద్యోగులు ఈ మూడు సార్లు పెంపును బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.. మొత్తానికి ఇక బకాయిలు చెల్లించరని తేల్చి చెప్పింది