"అన్ స్టాపబుల్" షో లో చంద్రబాబు... ఎన్నికల ముందు అయితే బాగుండేది !

VAMSI
టాలీవుడ్ అగ్ర హీరో బాలయ్య వరుస సక్సెస్ లతో కుర్ర హీరోలు కూడా కుళ్ళుకునే విధంగా దూసుకుపోతున్నాడు. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే... మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో హ్యాట్రిక్ సాధించాడు. సింహ మరియు లెజెండ్ ల తర్వాత డబల్ ఎంటర్టైన్మెంట్ తో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమాను ప్రేక్షకులు ఏ విధంగా నెత్తిన పెట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒక వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు ఆహా అనే ఓ టి టి యాప్ లో అన్ స్టాపబుల్ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఒక సీజన్ ను ఎంతో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని.. ఇప్పుడు రెండవ సీజన్ కు అంతా సిద్ద చేసుకున్నారు.
అయితే ఇప్పుడు రెండవ సీజన్ లో మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ గా ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ సీఎం మరియు టీడీపీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. లేటెస్ట్ గా ఈ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో ను కట్ చేశారు... ఇందులో పాత విషయాలను తెర మీదకు తీసుకురావడం జరిగింది. అప్పట్లో నందమూరి తారకరామారావు సీఎంగా ఉన్నప్పుడు, ఒకే పార్టీలో ఎన్టీఆర్ తో ఉన్న చంద్రబాబు నాయుడు కొందరి ఎమ్మెల్యేలను కలుపుకుని వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా అసలు జరిగిన విషయం ఏమిటో అన్నది ఇప్పటి ప్రజలకు తెలియచేయడానికి పూనుకున్నారు.
కానీ ఈ ప్రోగ్రాం కు చంద్రబాబు ను గెస్ట్ గా తీసుకురావడం మరియు ఇది ఒక ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రాం అని తెలియకుండా రాజకీయ సంబంధిత విషయాలను చర్చించడం వంటి పలు విషయాలు కొందరికి కొత్త కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. అయితే వాస్తవంగా ఆ రోజు జరిగింది ఏమిటి అన్నది అప్పటి ప్రజలకు తెలిసిందే మరియు ఇప్పుడు తెలుసుకుని ఉపయోగం లేదు. కానీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక పధకం ప్రకారమే చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని బాలయ్య దృష్టికి తీసుకు వచ్చాడని తెలుస్తోంది. మరి ఈ ఎపిసోడ్ టెలీకాస్ట్ అయితే మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది.. బహుశా చంద్రబాబు నాయుడు ఇంకా ఎన్నికల ముందు కనుక ఈ ప్లాన్ వేసుంటే బాగుండేదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: