మునుగోడు యుద్ధం: కేసీఆర్ సిపిఎం తో కలిసి గెలుస్తాడా ?
అయితే ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు కావొచ్చు... లేదా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన ఎన్నికల సర్వే వలన కావొచ్చు సీఎం కేసీఆర్ కి వచ్చే ఎన్నికల మీద బాగా భయం ఏర్పడింది. అందుకోసం ఏ చిన్న ఎన్నిక వచ్చినా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ గెలుపే ప్రధాన లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు. అందుకోసం మునుగోడు లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నాడు. కాగా తెరాస పైన మీడియా వర్గాలు చెబుతున్న విధంగా ఏమంత వ్యతిరేకత లేదన్నది వాస్తవం. అందుకే ఎక్కడో ఒక దగ్గర కేసీఆర్ కు కొంచెం దైర్యం ఉంది.
కాగా ఈ మునుగోడు ఎన్నికల కోసం కేసీఆర్ సిపిఎం ను మద్దతు అడిగినట్లు తెలిసిందే. దీనిపై విపక్షాలు అన్నీ కూడా కేసీఆర్ అవకాశవాది... తన అవసరం కోసం ఎవరి దగ్గరకు అయినా వెళ్తాడు లాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై సిపిఎం వాళ్ళు తగిన వివరణ ఇచ్చారు. కేసీఆర్ ఒక మంచి పని కోసం మమ్మల్ని మద్దతు కోరాడు. అందుకు మేము అంగీకరించాము. దేశంలో అవకతవక పాలన కొనసాగిస్తున్న బీజేపీని మునుగోడులో ఓడించడానికి కేసీఆర్ కు సపోర్ట్ చేస్తామని సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం మీడియా ముఖంగా తెలియచేశాడు. మరి కేసీఆర్ కాంగ్రెస్ బీజేపీ లను ఎదుర్కొని మునుగోడులో విజయం సాధిస్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్న ?