అదృష్టం అంటే వీళ్లదే.. తల్లికొడుకులకు ప్రభుత్వ ఉద్యోగాలు?

praveen
ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం కోసం ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతూ పుస్తకాల పురుగుల్లా మారిపోతున్నారు ఎంతోమంది అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమందికి మాత్రం ఎన్నిసార్లు ప్రయత్నించినా అటు ప్రభుత్వ ఉద్యోగం మాత్రం తృటిలో మిస్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. కొంతమందికి మాత్రం అదృష్టం వరించి ఇక ప్రభుత్వ ఉద్యోగం మొదటి ప్రయత్నంలోనే వచ్చేస్తూ ఉంటుంది.

 ఇటీవలి కాలంలో ఎంతో మంది లక్షల రూపాయలు వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని ప్రభుత్వ ఉద్యోగం కోసం తంటాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.. చిన్న స్వీపర్ ఉద్యోగం కోసం కూడా డిగ్రీలు పీజీలు చదివినవారు అప్లై చేస్తూ ఉన్నారు. అంటే ఇక ప్రభుత్వ ఉద్యోగానికి నేటి రోజుల్లో ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా వేళల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతూ ఉంటే లక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తులు వస్తూ ఉండటం చూస్తూ ఉంటే ఇలాంటి పోటీ మధ్య ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు అని చెప్పాలి.

 కానీ అసాధ్యం అనుకున్నది ఇక్కడ తల్లీ కొడుకులు సాధించి చూపించారు. ఏకంగా ఒకే ఇంట్లోని తల్లీ కొడుకులు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. ఈ ఘటన కేరళ లోని మల్లాపురం లో వెలుగులోకి వచ్చింది. 42 ఏళ్ల బిందు లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ పరీక్షలో 92 వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఇక కుమారుడు లోయర్ డివిజన్ క్లర్క్ పరీక్షలో 38వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. అయితే ముందుగా కొడుకుని ప్రోత్సహించడానికి చదవడం మొదలు పెట్టిన ఆమె ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: