ఇల్లు కోసం తవ్వుతుంటే.. బయటపడిన మరో ఇల్లు.. అందరూ షాక్?

praveen
ఒకప్పుడు రాజుల కాలం నాటి కట్టడాలు.. గుప్త నిధులు ఎక్కడ దాగి ఉన్నాయి అన్నది ఎవరికీ తెలియదు అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడైనా ఏదైనా అవసరం అయ్యి భూమిని తవ్వినప్పుడు ఇక ఇలాంటి అరుదైన కట్టడాలు బయట పడటం లాంటి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇక ఇలాంటి అరుదైన కట్టడాలు  బయటపడితే ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. దొడ్డబళ్ళాపురం రామనగర పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డులో పునాది కోసం మట్టిని తవ్వితున్న సమయంలో పురాతన కట్టడం బయటపడింది.



 నవాజ్ అనే వ్యక్తి దుకాణం నిర్మించాలి అని భావించాడు అయితే పునాది పటిష్టంగా ఉండాలి అని భావించి ఇక పునాది కోసం మట్టిని తవ్విటం ప్రారంభించాడు. ఇలా కొంచెం తవ్వినా తర్వాత ఏదో గట్టిగా తగులుతున్న టు అనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఇక ఇంకాస్త తవ్వగా లోపల ఏదో శిధిలావస్థలో ఉన్న భవనం ఉంది అన్నట్లుగానే కనిపించింది. చివరికి ఒక రహస్యమైన కట్టడం బయట పడింది అని చెప్పాలి. అయితే నాణ్యతతో నిర్మించబడిన ఈ కట్టడం వందల ఏళ్లనాటిది అన్నది మాత్రం తెలుస్తుంది.


 కాలక్రమేణా ఈ కట్టడం మట్టితో  మూసుకుపోవడంతో భూగర్భజలం లో కలిసి పోయింది అని అర్థమవుతుంది. ఇలా భూగర్భంలో  కలిసిపోవడంతో ఇన్నాళ్ళ వరకు ఎవరి కంట పడలేదు ఈ భవనం. ఇక ఇలా మట్టిలో కూరుకుపోయిన భవనం టిప్పు సుల్తాన్ కాలంలో నిర్మించబడిందని స్థానిక చరిత్రకారులు చెబుతూ ఉండటం గమనార్హం. అయితే ఇక ఇలా మట్టి లో ఉన్న భవనం రూపురేఖలను చూస్తుంటే ఆయుధాగారం మాదిరిగా ఉందని అంటున్నారు స్థానికులు. శ్రీరంగపట్టణం లోనూ ఇలాంటి కట్టడాలు ఉన్నాయి అంటూ చర్చించుకుంటున్నారు. నేల మాళిగ నిర్మించి ఇందులో ఆయుధాలు తయారు చేసి నిల్వ చేసే వాని స్థానికులు గుసగుసలు పెట్టుకుంటున్నారు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: