16 రకాల ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేసిన కేంద్రం.. ఏవంటే?

Satvika
ప్లాస్టిక్ ఒక భూతం.. ఎన్నో రోగాలను కలిగిస్తుంది..ఎన్నో రకాల కెమికల్స్ ఉండటంతో వాటిలో ఆహారా పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి హానీ చేస్తాయి. చర్మ రోగాల నుంచి జుట్టు సమస్యల వరకూ ఎన్నో రకాల వ్యాధులను కలిగిస్తాయి. క్యారీ చేయడానికి సులువుగా ఉండే ఈ వస్తువులను వాడటం అంత మంచిది కాదు..ఈ విషయం పై అధికారులు ఎన్నో విధాలుగా చెప్పి చూస్తున్నారు. కాని జనాల్లొ మాత్రం ఎటువంటి మార్పులు రాలేదు..ఎదావిధిగా ఉంటున్నారు..ఈ విషయం పై సీరియస్ అయిన కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.ఏకంగా ప్లాస్టిక్ వస్తువులను బ్యాన్ చేసింది..ఏ వస్తువులను బ్యాన్ చేసిందొ ఇప్పుడు తెలుసుకుందాం..

మనిషి జీవితంలో ఓ భాగంగా మారిన ప్లాస్టిక్ వినియోగంపై నిషేధించింది. ఏకంగా 16 రకాలైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్రం నిషేధం విధించింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకిరానుంది. నిషేధం విధించిన ప్లాస్టిక్లో ఇయర్ బడ్స్ నుంచి బెలూన్ల వరకు ఉన్నాయి. పైగా, ప్లాస్టిక్ ముడి పదార్థాలను సరఫరా చేయొద్దని పెట్రో కెమికల్ సంస్థలను కూడా ఆదేశించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.కేంద్రం నిషేధించిన ప్లాస్టిక్ వస్తువుల జాబితాలో ఇయర్ బడ్స్, బెలూన్లు, క్యాండీ, ఐస్క్రీమ్ కోసం వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, ఫోర్కులు, చెంచాలు, కత్తులు, ట్రేలు, ప్లాస్టిక్ స్వీట్ బాక్సులు, ఆహ్వాన పత్రాలు, సిగరెట్ ప్యాకెట్లు, 100 మైక్రాన్ల లోపు ఉండే పీవీసీ బ్యానర్లు, అలంకరణ కోసం వాడే థర్మాకోల్ వంటి 16 రకాల వస్తువులు ఉన్నాయి..

ఒకసారి వాడిపారేసే వస్తువులను తయారు చేసే పరిశ్రమలకు ఎలాంటి ప్లాస్టిక్ ముడి సరకులులను సరఫరా చేయొద్దని పెట్రో కెమికల్ సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీచేసింది..కేంద్రం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం ఆయా కంపెనీల పై కఠిన చర్యలను తీసుకోవాలని కేంద్రం సంభంధిత అధికారులకు కేంద్రం సూచించింది. పైన తెలిపిన వస్తువులను అమ్మిన, కొనిన కూడా చట్ట రీత్యా నేరమన్న విషయం అందరికి తెలిసిందే..బీ కేర్ ఫుల్ మిత్రమా..
.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: