సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ కష్టమే?

Purushottham Vinay
ఇక సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌పై ఇప్పటికీ కూడా తేల్చలేకపోయారు. జూలై ఒకటో తేదీ నుంచి ప్రొబేషన్ ఖరారై పెరిగిన జీతం వస్తుందని అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.కానీ ఇంత వరకూ కూడా ఎంత మందిని ప్రొబేషన్‌కు ఎంపిక చేశారు ? అన్నదానిపై ఇంకా క్లారిటీ అనేది అసలు లేదు. ఉత్తర్వులు కూడా రాలేదు. ఇక ఓ సారి ప్రభుత్వం నేరుగా జీవో ఇస్తుందని చెబుతారు.. అలాగే మరోసారి కలెక్టర్లు ప్రొబేషన్ ఖరారు చేస్తారని చెబుతారు. కానీ ఇప్పటి వరకూ కూడా అసలు ఏ ప్రక్రియ ద్వారా ప్రొబేషన్ ఖరారు చేస్తారో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దాదాపుగా లక్షా ఇరవై వేల మంది సచివాలయ ఉద్యోగలు ఈ ప్రొబేషన్ ప్రక్రియ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక లెక్క ప్రకారం ఎలాంటి పరీక్షలు లేకుండా అందర్నీ కూడా ప్రమోట్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగిగా ఖరారు చేసి ఆ మేరకు పే స్కేల్ ని ఇవ్వాలి. ఇక ఇందు కోసమే వారు దాదాపుగా మూడేళ్లుగా కేవలం రూ. పదిహేను వేలకే పని చేస్తున్నారు. ఇంత తక్కువ జీతానికి ఏళ్ల తరబడి పనిచేయడంతో చాలా మంది కూడా బాగా ఆవేదనకు గురవుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏరికోరి వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ వారిని అసలు పట్టించుకోవడం లేదు. పరీక్షలని ఇంకా మరొకటని వారిని వేధింపులకు గురి చేస్తోంది.


తాజాగా గడువు మించిపోతున్నా కూడా అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.జూలై నెల మొదటికి పెరిగిన జీతాలు వస్తాయని ఆశపడుతున్న వారికి రోజులు గడుస్తున్న కొద్దీ టెన్షన్ కూడా పెరుగుతోంది. ఇప్పటికిప్పుడు ప్రొబేషన్లు ఖరారు చేసిన వారికి జీతం బిల్లులు కూడా ప్రిపేర్ చేయాలంటే చాలా లెక్కలు చూడాల్సి ఉంటుంది. చాలా ప్రక్రియ అనేది ఉంటుంది. దీనికి సమయం సరిపోదని.. ఇంకా వాయిదా వేస్తారేమోనన్న ఆందోళన చాలా మందిలో కూడా కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ హామీని నిలబెట్టుకోకపోతే సచివాలయ ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఉద్యోగుల్ని టెన్షన్ పెట్టకుండా వేగంగా నిర్ణయం తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: