గన్నవరం ఎమ్మెల్యే టికెట్ పై వంశీ ఆశలు ఫలించేనా?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయ నాయకుల మదిలో నెక్స్ట్ ఎన్నికల గురించి మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ఇపుడు విపక్షాలు అన్నీ కూడా 2024 లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా అధికార వైసీపీ ని గద్దె దించాలి అన్న ప్రణాళికలతో తలమునకలై ఉన్నారు. ఇందులో టీడీపీ, జనసేన మరియు బీజేపీ లు ఒక్కటిగా పోటీ చేస్తాయా ? లేదా ఆ ఒంటరిగా వెలతాయా అన్నది  మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఇదిలా ఉంటే... ఇప్పుడు మరొక విషయం చర్చకు వచ్చింది. గత ఎన్నికలలో టీడీపీ తరపున గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి వల్లభనేని వంశీ గెలుపొందారు.

అయితే రాష్ట్రంలో వైసీపీ కి దక్కిన ఆదరణ చూసి వంశీ టీడీపీ పై ఏదో సాకు చూపుతూ వైసీపీ లోకి చేరుతున్నట్లు గా తనకు తానే ప్రకటించుకున్నాడు. ఎన్నికలకు ముందు జగన్ ను తిట్టిన వంశీ, ఇక అప్పటి నుండి టీడీపీ ని మరియు చంద్రబాబు ను తిట్టడం మొదలు పెట్టాడు. అలా 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ ల చర్చలో గన్నవరం తరపున పోటీకి వైసీపీ నుండి ఎవరికి సీటు దక్కనుంది అన్న విషయం హాట్ టాపిక్ అయింది. ఇదే నియోజకవర్గంలో మొదటి నుండి వైసీపీ నాయకుడిగా జగన్ దగ్గర నమ్మకం మరియు ప్రజలలో విశ్వాసాన్ని  కూడగట్టుకున్నాడు దుట్టా రామచంద్రరావు. ఇప్పటికే దుట్టా మీడియా ముందు వంశీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మా నుండి ఎటువంటి మద్దతు ఉండదని కరాఖండిగా చెప్పేశాడు.

అయితే ఇప్పుడు ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలు ఉండడంతో జగన్ ఎవరికి టికెట్ ఇస్తాడు ? ఎన్నో ఆశలను పెట్టుకుని ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న టీడీపీ ని వదిలి వచ్చిన వంశీకి గౌరవం దక్కుతుందా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అప్పటి వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: