సామాన్యులపై కేంద్ర ప్రభుత్వానికి ప్రేమ పెరిగిందే ?

VAMSI
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం కారణంగా అలాగే పలు మార్కెటింగ్ బ్యాలెన్స్సెస్ కారణంగా దేశంలో వంట నూనె, పెట్రోల్ - డీజిల్ రేట్లు ఆకాశానికి అంటాయి. నిన్న, మొన్నటిదాకా వినియోగదారులకు చుక్కలు చూపించాయి. వాహనదారులు అయితే నిత్యం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో బెంబేలెత్తిపోయారు. ఒక లీటర్ కు 120 రూపాయలను సైతం దాటిన రాష్ట్రాలు కూడా ఉండటం గమనార్హం. అయితే సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసిన ప్రభుత్వం కాస్త దిగి వచ్చి ఈ మధ్య ధరలు కొంతలో కొంత తగ్గించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై అమలు చేస్తోన్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై ఎనిమిది, డీజిల్‌పై ఆరు రూపాయలను తగ్గించి సంతోష పరిచింది.
ఈ రెండింటి ధరలో ఎంతోకొంత తగ్గడంతో వాహనదారులు సంతోషించారు . కాగా ఇపుడు ఇలాంటి మరో వార్తతో సామాన్యులకు ఊరట కలిగించింది సర్కారు. వంట నూనె ధరలను తగ్గించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వంటనూనెల ధరలను తగ్గిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాత్రికి రాత్రి కీలక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనె దిగుమతులపై వసూలు చేస్తోన్న కస్టమ్స్ డ్యూటీ రద్దు చేస్తూ కీలక ప్రకటన చేసింది. అలాగే దీనిపై విధించిన అయిదు శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను ఎత్తివేస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం ఈ నోటిఫికేషన్ అమల్లో ఉంటుంది అని శుభవార్త  తెలిపింది.
ఈ వార్త విన్న ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు... ధరలను ఇంకా తగ్గించి సామాన్యులకు భారం కాకుండా అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు. అయితే దీనిని బట్టి సామాన్యులపైనా ప్రభుత్వానికి ప్రేమ పెరిగిందని అంతా చెప్పుకుంటున్నారు. మొన్న పెట్రోల్ ధరలలో తగ్గుదల.. నిన్నేమో ఆయిల్ ధరలు తగ్గుదల చూస్తే మనకు మంచి రోజులు ముందున్నాయి అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: