కాశ్మీర్ అంశంపై.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు?

praveen
భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్లో పరిస్థితులు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కాశ్మీర్ భారత్లో భాగం అని చెప్పుకున్నప్పటికీ అటు కాశ్మీర్లో మాత్రం ఎప్పుడూ ఉగ్రవాదులు మారణ హోమాలు సృష్టిస్తూనే ఉండే వారు. అక్కడ ప్రజలు కూడా ఉగ్రవాదులకు ఎంతో మద్దతు ఇస్తూ ఉండేవారు. దీంతో ఉగ్ర కుట్రలను నిలువరించడం అటు పోలీసులకు ఎంతో సవాలుగా మారిపోయేది అని చెప్పాలి. అయితే ఇక కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఏకంగా కాశ్మీర్  ప్రాంతంలో అమలులో ఉన్న 370 ఆర్టికల్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

 కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా కాదు ఇక భారత్లో భాగం అంటూ తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే భారత చట్టాలనే ఇక కాశ్మీర్ లో కూడా అమలవుతాయి అంటూ తెలిపింది. 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండడానికి ఏకంగా ఎంతో మంది సైనికులను కాశ్మీర్లో మోహరించింది. అయితే మోడీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసిన నాటి నుంచి కూడా అటు పాకిస్థాన్ ఎప్పుడు భారత్ పై దుమ్మెత్తి పోస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ఇదే విషయంపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్ చేశాడూ.

 ఇస్లామిక్ దేశాల నుంచి ఒత్తిడి లేకపోవడం వల్లనే మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా కల్పించే 370 ఆర్టికల్ ను రద్దు చేసిందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించాడు. ప్రజాభిప్రాయ సేకరణ తో తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం అటు కాశ్మీర్ లో ఉన్న ప్రజలందరికీ ఉన్నప్పటికీ ఆ అవకాశం మాత్రం భారత ప్రభుత్వం కాశ్మీర్ ప్రజలకు ఎప్పుడు ఇవ్వలేదు అంటూ వ్యాఖ్యానించాడు ఇమ్రాన్. ఇక కాశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయ్. ఇక దీనిపై అటు భారత విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుంది పాకిస్థాన్ కి ఎలా కౌంటర్ ఇస్తుంది అన్నది చూడాలి?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: