సీడబ్ల్యూసీ: గాంధీ కుటుంబం రాజీనామా చేస్తారా..!

MOHAN BABU
 ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యుసి సమావేశం హాట్ టాపిక్ గా ముగిసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందిన విషయం అందరికి తెలిసిందే. దీంతో పార్టీ అధ్యక్ష పదవిలో ప్రక్షాళన చేయాలని ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. జి 23 అసమ్మతి నేతలు ఇప్పటికే హైకమాండ్ను డిమాండ్ చేశారు. అయితే మహారాష్ట్రకు చెందినటువంటి సీనియర్ నేత అయిన ముకుల్ వాస్నిక్ కు అధ్యక్ష పదవి ఇవ్వాలని అసమ్మతి నేతలు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. గాంధీ కుటుంబీకులకు కాకుండా ఇతర నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


కానీ రాజస్థాన్ సీఎం  అశోక్ గెహ్లాట్ రాహుల్ గాంధీకే బాధ్యతలు అప్పగించాలని అంటున్నారు. అయితే జి 23 నాయకుల డిమాండ్లు, అలాగే పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే తీసుకునే అవకాశం కనబడుతోంది. గాంధీ కుటుంబం నుండి కాకుండా ఇతరులకు ఎవరికైనా సరే పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని భావిస్తున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో బాధ్యతల నుండి దూరంగా ఉండకుండా రాహుల్ గాంధీకి పార్టీ పటిష్టత బాధ్యతలు ఇస్తారా అనేది సమావేశంలో చర్చిస్తున్నారు. అయితే ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఘోర పరాభవం పాలైంది. ఇక పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది.


ఇక మిగిలిన రాష్ట్రాల్లో ఆశించిన ఫలితాలు రాకపోగా, ఈ యొక్క అసమ్మతి నేతలు ప్రత్యేక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పవచ్చు. 2021 అక్టోబర్  నెలలో సిడబ్ల్యుసి సమావేశమైంది. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్లో అసమ్మతి స్వరం వినిపిస్తున్న సందర్భంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక చేయాలని, అలాగే పార్టీ యొక్క సంస్థాగత ఎన్నికల పూర్తిచేయాలని  అసమ్మతి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లు కీలక పదవులకు రాజీనామా చేయనున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: