డెబిట్ కార్డ్ లేనివారికి కేంద్రం నుంచి గుడ్ న్యూస్..!!

Purushottham Vinay
ఇక ఒకప్పుడు బ్యాంకు ద్వారా లావాదేవీలు కొనసాగాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. బ్యాంకు కి వెళ్లడం గంటలు గంటలు నుంచోని వెయిట్ చెయ్యడం చాలా కష్టంతో కూడుకున్న పని. సమయం కూడా వృధా అయిపోతుంది. ఇక యూపీఐ వచ్చాక లావాదేవీలు కష్ట తరం కాకుండా చాలా ఈజీగా అవుతున్నాయి.అందువల్ల దేశంలో యూపీఐ చెల్లింపుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. ఇక దేశంలో ఈ యూపీఐ చెల్లింపుల సంఖ్య పెరిగిపోతున్న వేళ.. దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్పీసీఐ) కీలక నిర్ణయాన్ని తీసుకుంది.ఇక ఆ నిర్ణయం ఏమిటంటే.. డెబిట్‌ కార్డు లేని వారికి కూడా యూపీఐ పిన్‌ సెట్‌ చేసుకునే మంచి ఛాన్స్ ని కల్పించింది. ఆధార్‌ నంబర్‌ ఇంకా ఓటీపీ ద్వారా పిన్‌ సెట్‌ చేసుకునే వెసులుబాటు కల్పించాల్సిందిగా వివిధ బ్యాంకులకు సూచించింది. 



ఇక దీనికి సంబంధించి గత ఏడాదే సర్క్యులర్‌ జారీ చేసిన ఎన్పీసీఐ.. ఇందుకు గాను డిసెంబరు 15 వరకు కూడా గడువుని విధించింది.కానీ, బ్యాంకులు కనుక ఆలోపు చర్యలు తీసుకోలేక పోవడంతో.. ఈ గడువును తాజాగా ఈ నెల చివరి వరకు కూడా పొడిగించింది. ఇప్పటి దాకా యూపీఐ పిన్‌ సెట్‌ చేసుకోవాలంటే.. డెబిట్‌ కార్డు తప్పనిసరిగా ఉండాలి.డెబిట్ కార్డ్ లోని చివరి ఆరు అంకెలను తప్పనిసరిగా ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, దేశంలో ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది బ్యాంకు ఖాతాదారులకు డెబిట్‌ కార్డులు లేవు. ఇలాంటి వారు కూడా ఇక ఇప్పుడు ఆధార్‌ నంబరు ఇంకా అలాగే ఓటీపీ ద్వారా యూపీఐ పిన్‌ ని ఈజీగా సెట్‌ చేసుకోవచ్చు. ఇక ఈ విధానం వలన యూపీఐ వినియోగదారుల సంఖ్య మరింత పెరుగుతుందని ఎన్పీసీఐ ఆశిస్తోంది.నిజంగా ఇది డెబిట్ కార్డ్ లేనివారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: