షాకింగ్‌: ఉక్రెయిన్‌ అణుబాంబు తయారు చేస్తోందా?

Chakravarthi Kalyan
రష్యా, ఉక్రెయిన్ మధ్య కొన్నిరోజులుగా యుద్ధం జరుగుతోంది.. రెండు దేశాల మధ్య కాదు.. రష్యాయే ఉక్రెయిన్‌పై దాడికి దిగుతోంది.. మరి ఈ యుద్ధానికి కారణం ఏంటి.. దీనికి రష్యా చెబుతున్న సమాధానం.. ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు ప్రయత్నించడమేనట. అయితే.. ఇదంతా పైకి చెబుతున్న కారణం మాత్రమే.. కానీ.. అసలు కారణం వేరే ఉందట.. దాన్ని ఇప్పుడు రష్యన్ మీడియా ఫోకస్ చేస్తోంది. మరి ఆ టాప్ సీక్రెట్ ఏంటంటే.. కొన్నేళ్లుగా రష్యాతో ఉక్రెయిన్‌కు సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్నాయి. ఇప్పుడు అవి తారస్థాయికి చేరాయి.

ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అణు ఆయుధాల తయారీని ప్రారంభించాలని నిర్ణయించుకుందట.. అందుకు తగిన ఏర్పాట్లు ప్రారంభించిందట. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌ అణు విద్యుత్తు కేంద్రంలో ఆ దేశం అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందట. ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వ ప్రతినిధి తాజాగా వ వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలను రష్యా మీడియా తాజాగా ప్రచురించింది. వాస్తవానికి అణ్వాయుధాలను వదిలేస్తున్నట్టు 1994లోనే ఉక్రెయిన్ ప్రకటించింది. పాత సోవియట్ యూనియన్‌ నుంచి ఉక్రెయిన్‌కు వారసత్వ పంపకం ద్వారా వచ్చిన అణ్వాయుధాలను 1994లో వదులుకుంది. ఇందుకు ఐక్యరాజ్య సమితి చొరవ చూపింది.  

అలాంటి ఉక్రెయిన్ ఇటీవల అణు బాంబు తయారీ దిశగా అడుగులు వేయడం ప్రారంభించింది. ఉక్రెయిన్‌ మళ్లీ అణుబాంబు తయారు చేస్తోందంటే.. అది తమపై వేయడానికే అని రష్యా భావించింది. అందుకే రష్యా ఉక్రెయిన్‌పై ఆ స్థాయిలో యుద్ధానికి దిగిందట. సొంతంగా అణు బాంబు తయారీకి రష్యా అణు పరిజ్ఞానాన్నే వాడుకోవాలని ఉక్రెయిన్‌ ప్రయత్నించిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పినట్లు  ఆ దేశ మీడియా చెబుతోంది.

ఉక్రెయిన్‌ తయారు చేయనున్న అణు బాంబుకు ఆ దేశం ‘డర్టీ బాంబ్‌’ అని పేరు కూడా పెట్టిందట. అణు బాంబు తయారు చేయాలంటే ఫ్లూటోనియం కావాలి. దాన్ని అమెరికా ఉక్రెయిన్‌కు సరఫరా చేసే అవకాశం ఉందని రష్యా భావిస్తోంది. అణు బాంబుకు అవసరమైన యురేనియం కోసం కూడా  ఉక్రెయిన్‌ ఇటీవల తీవ్రంగా ప్రయత్నిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: