నాలుగేళ్లకే పోలీసు ఉద్యోగం.. ఎలా వచ్చిందంటే?
సాధారణంగా పోలీసు ఉద్యోగం సాధించాలి అంటే తప్పనిసరిగా పరీక్షల్లో పాస్ కావాలి.. అంతే కాకుండా ఫిజికల్ టెస్ట్ ల్లో కూడా మంచి మార్కులు సాధించాలి.. ఇలా మెరిట్ సాధించినప్పుడే ఉద్యోగం సాధించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా నాలుగేళ్ళ వయస్సుకే పోలీస్ జాబ్ కొట్టేసాడు ఇక్కడ ఒక బాలుడు. మధ్యప్రదేశ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ చిన్నారి పేరు గజేంద్ర.. అతనికి కేవలం నాలుగేళ్ల వయసు మాత్రమే. అతడు పెద్దయ్యాక పోలీస్ అయ్యేవాడు లేదో తెలియదు. కానీ చిన్నప్పుడే అతనికి పోలీసు ఉద్యోగం వచ్చేసింది.
నాలుగేళ్ల వయసు కు పోలీసు ఉద్యోగం రావడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆ బాలుని తండ్రి శ్యామ్ సింగ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ ఇక ఇటీవలే మరణించాడు. ఈ క్రమంలోనే జిల్లాలో బాల రక్షక్ పోస్టులు ఖాళీగా ఉండటంతో నిబంధనల మేరకు గజేంద్ర కు ఉద్యోగం ఇచ్చిన ట్లు ఎస్పి సునీల్ చెప్పుకొచ్చారు. 18 ఏళ్ళు వచ్చేవరకు ఆ బాలుడికి సగం జీతం చెల్లించనున్నారు. ఇక ఆ బాలుడు యధావిధిగా బడికి వెళ్లి చదువుకోవచ్చు అంటూ పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా నాలుగేళ్ల బాలుడు కానిస్టేబుల్ గా ఉద్యోగం రావడం మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది..