ప్రధాని మోదీకి జెలెన్ స్కీ ఫోన్... సాయం చేస్తారా?
మరో వైపు బాధిత దేశం యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా సైనికుడిలా దేశ ప్రజల కోసం పోరాడుతున్నాడు. కాగా తాజాగా జెలెన్ స్కీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. జెలెన్ ప్రధాని మోదీతో ప్రస్తుతం తమ దేశం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని మరియు రష్యా చేస్తున్న దాడిని అంతా వివరించి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ భయంకర పరిస్థితులలో భారత్ సాయం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు కోరారు. ప్రధాని సైతం జెలెన్ కు ధైర్యాన్ని కోల్పోవద్దని మనోధైర్యాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా వీరిద్దరూ చాలా విషయాల గురించి చర్చించించుకున్నారట. అంతే కాకుండా జెలెన్ ఐక్యరాజ్యసమితిలోని భద్రత మండలిలో రాజకీయంగా మీరు మాకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
ఇకనైనా రష్యా ఉక్రెయిన్ పై దాడులు విరమించుకోవాలని కోరినట్లు సమాచారం. ఇలా పలు విషయాలను పంచుకున్నట్లు స్వయంగా జెలెన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే ఈ రోజు ఉదయమే రష్యాకు వ్యతిరేకంగా పెట్టిన ఓటింగ్ లో భారత్ పాల్గొనకుండా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీనిని బట్టి జెలెన్ కోరిన విధంగా భారత్ రాజకీయంగా మద్దతు ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది.