ఏపీఎస్ఆర్టీసీకి ఊహించని షాక్.. ఆ రాయితీ కట్?

praveen
ఇటీవల కాలంలో ముడి చమురు ధరలు ఎంతలా పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలా డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆర్టీసీ సంస్థ భారీగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుంది. అయితే బయట పెట్రోల్ బంకుల్లో విక్రయించే ధరకంటే అటు ఆర్టీసీ సంస్థకూ సరఫరా చేసే డీజిల్ ధర మాత్రం కాస్త తక్కువగానే ఉంటుంది. ఇక ఇది ఆర్టీసీకి  కాస్త ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ కి ముడి చమురు కంపెనీలు ఊహించని రేంజ్ లో షాక్ ఇచ్చాయి అనేది తెలుస్తుంది.


 ప్రతిరోజు ఆర్టీసీ సంస్థలో లక్షల లీటర్లు డీజిల్ వినియోగిస్తూ ఉంటారు. అయితే మొన్నటి వరకూ బయట పెట్రోల్ బంక్  లో డీజిల్ ధర కంటే తక్కువ ధరకే సరఫరా చేసాయ్ ముడి చమురు కంపెనీలు. కానీ గత పది రోజులుగా మాత్రం పెట్రోల్ బంకులో విక్రయించిన దానికంటే ఆర్టీసీకి ఇచ్చే డీజిల్ ధర 4.30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా లీటర్ డీజిల్కు 4.30 రూపాయలు అనిపించినప్పటికీ లక్షల లీటర్లు వినియోగించే ఆర్టీసీకి మాత్రం దాదాపు పది కోట్ల వరకూ ఈ ధరల పెరుగుదల ద్వారా భారం పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీఎస్ ఆర్టీసీ ఎండి ద్వారకాతిరుమలరావు కీలకమైన ఉత్తర్వులు జారీ చేశారు.



 బయట ఉన్న పెట్రోల్ బంకు లోనే ఆర్టీసీ బస్సుల్లో పెట్రోల్ కొట్టించాలి అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చెబుతున్న లెక్క ప్రకారం 10 వేల బస్సులకు గాను ప్రతిరోజు సుమారు 7.3 లక్షల లీటర్ల డీజిల్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఇలా ఎక్కువ వినియోగం ఉండడం వల్ల ముడి చమురు కంపెనీల నుంచి రాయితీ లభిస్తూ ఉంటుంది. దాదాపు బయట మార్కెట్తో పోలిస్తే రెండు నుంచి మూడు రూపాయల వరకు ప్రతి లీటర్కు ఆర్టీసీకి రాయితీలు ఇస్తూ ఉంటాయి ముడి చమురు కంపెనీలు. గత కొంత కాలం నుంచి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి.. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగిపోయాయి. దీంతో ఆర్టీసీకి  సరఫరా చేసే డీజిల్పై ఉన్న రాయితీని ఎత్తి వేయడమే కాదు అటు బయట పెట్రోల్ బంకుల్లో ఉన్న ధర కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తూ ఉండటం గమనార్హం. దీంతో ఏపీఎస్ఆర్టీసీ కి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: