మంత్రి గౌతమ్ రెడ్డి లైఫ్ స్టైల్ & పొలిటికల్ కెరీర్...

VAMSI
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఐటీ శాఖా మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటు రావడంతో మరణించాడు. దాదాపు గంట వరకు ఇంట్లోనే ఆలస్యం కావడంతో ప్రాణాలు కోల్పోయింనట్లు జూబిలీ హిల్స్ అపోలో హాస్పిటల్ వైద్యులు తెలియచేశారు. ఈయన మరణంతో అటు రాజకీయంగా మరియు వ్యక్తిగతంగా ఎందరో తమ విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గౌతమ్ రెడ్డి మరణం గురించి తెలుసుకున్న ఏపీ మరియు తెలంగాణ నేతలు ఒక్కొక్కరుగా ఇంటికి వచ్చి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఇంత మందిలో కనీసం ఒక్కరు కూడా ఈయన గురించి ఒక్క మాట కూడా నెగిటివ్ గా మాట్లాడడం లేదంటే నమ్మండి. అన్ని విషయాలలో ఎంతో కరెక్ట్ గా, నమ్మకంగా, విశ్వాసంగా, బాధ్యతగా తన పనులను చేసుకుంటూ వచ్చాడు.
ఇతను మాములుగా మొదటి నుండి రాజకీయాల్లో ఉన్నది లేదు. గౌతమ్ రెడ్డి హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేశాడు. మరియు టెక్సటైల్స్ లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. ఎక్కువగా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటూ ఉండేవాడు. కానీ తన తండ్రి సీనియర్ రాజకీయ నాయకుడు మరియు నెల్లూరు ఎంపీ అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి కి వయసు మీద పడడం తో కొడుకును రాజకీయ రంగంలోకి దించి తాను రాజకీయాల నుండి తప్పుకోవాలని భావించాడు. అందులో భాగంగానే 2014 లో ఆత్మకూరు నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే గా పోటీ చేయించాడు. అయితే తన కుటుంబానికి ప్రజల్లో మంచి పేరు ఉండడంతో తొలి రాజకీయ అడుగే గ్రాండ్ సక్సెస్ అయింది. గౌతమ్ రెడ్డి ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థిని చిత్తు చిత్తు గా ఓడించి అసెంబ్లీ లోకి అడుగు పెట్టాడు.
అలా రాజకీయాలలోకి మొదటి అడుగు పడింది. ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూడాల్సిన అవసరం పడలేదు. పార్టీలో అందరితో మంచిగా ఉంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. గౌతమ్ రెడ్డి అంటే సీఎం జగన్ కు ఎంతో అభిమానం. ఇక ఆ తర్వాత జరిగిన 2019 ఎలక్షన్స్ లో వైసీపీ గెలవడం మళ్ళీ రెండవ సారి గౌతమ్ రెడ్డి ఎమ్మెల్యే గా గెలవడంతో మంత్రి బాధ్యతను జగన్ తనకు అప్పగించాడు. ఒక మంత్రిగా తన బాధ్యతను ఎప్పుడూ విస్మరించింది లేదు. ఈయనకు ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. ప్రస్తుతం వీరి ఫ్యామిలీ తీవ్ర దుఃఖంలో ఉంది. ఆ భగవంతుడు వీరికి కొండనాథా ధైర్యాన్ని ఇవ్వాలని, అలాగే గౌతమ్ రెడ్డి ఆత్మ శాంతించాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: