క్యా బాల్ హై.. బుమ్రా దెబ్బకు సాల్ట్ ఫ్యూజులు ఔట్.. వీడియో వైరల్?

praveen
టీమిండియాలో కీలక బౌలర్ ఎవరు అంటే ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చేది బుమ్రా పేరు ఎందుకంటే దశాబ్ద కాలం నుంచి టీమిండియా తరఫున ఆడుతూన్న ఇటగాడు తన టాలెంట్ ఏంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ బౌలర్ల లిస్టులో అతని పేరు ముందు వరుసలో వినిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక భారత జట్టుకు కీలక బౌలర్ గా మాత్రమే కాదు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా కూడా కొనసాగుతున్నాడు. ఇక వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో కూడా భారత జట్టును విజయ తీరాలకు చేర్పించడంలో బుమ్రా ఎంతో కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు వెస్టిండీస్ అమెరికా వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో కూడా అదరగొట్టేస్తున్నాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు బుమ్రా అద్భుతమైన బంతులను సంధిస్తూ బ్యాటర్ల మతి పోగుడుతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.కాగా కాక ఇటీవల టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ టీమిండియా మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి బంతివేసి అదరగొట్టేశాడు. ఏకంగా గయానా వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఒక కళ్ళు చెదిరే బంతితో బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ ను అవాక్కయ్యేలా చేశాడు.

 ఇంగ్లాండ్ విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ఫీల్ సాల్టును బుమ్రా ఇలా అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఇంగ్లాండు ఇన్నింగ్స్ ఐదవ ఓవర్ వేసిన బుమ్రా బ్యాటర్లతో మైండ్ గేమ్స్ ఆడాడు  ఎంతో స్లో డెలివరీలుగా వేసాడు. అయితే రెండో బంతికి సింగిల్ తీసి సాల్ట్ కి స్ట్రైక్ ఇచ్చాడు మోయిన్ అలీ. కానీ మూడో బంతిని మాత్రం ఫుల్ ఫేస్ తో బౌలింగ్ చేశాడు. నాలుగో బంతి స్లో డెలివరీ గా వస్తుందని భావించిన సాల్ట్ కు బుమ్రా ఊహించని షాక్ ఇచ్చాడు. నాలుగో డెలివరీని ఫుల్ ఫేస్ తో పర్ఫెక్ట్ ఆఫ్ కట్టర్ గా బుమ్రా సందించాడు. దీంతో సాల్ట్ లెగ్ సైడ్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతని బ్యాట్ ని మిస్ చేసుకుని వికెట్లను గిరాటేసింది. దీంతో బుమ్రా దెబ్బకు సాల్ట్ ఒక్కసారిగా బిత్తర పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: