మన శంకర వరప్రసాద్ గారు : అది అత్యంత చిన్న టార్గెట్ కానుందా..?
ఈ మూవీ కి నైజాం ఏరియాలో 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా , సిడెడ్ లో 18 కోట్లు , ఉత్తరాంధ్రలో 14 కోట్లు , ఈస్ట్ లో 9.50 కోట్లు , వెస్ట్ లో 7.20 కోట్లు , గుంటూరులో 9 కోట్లు , కృష్ణ లో 7.25 కోట్లు , నెల్లూరు లో 4.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమాకు కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 8.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఓవర్సీస్ లో ఈ మూవీ కి 12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 120.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 122 కోట్ల షేర్ కలక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. ఇక ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో ఈ సినిమా ఈజీగా ఈ టార్గెట్ ను అందుకొని భారీ లాభాలను కూడా అందుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుంది అని అనేక మంది భావిస్తున్నారు.