మెగాస్టార్ చిరంజీవి తాజాగా మన శంకర వర ప్రసాద్ గారు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్ షో లను నిన్న రాత్రి అనేక ప్రాంతాలలో ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభించింది. ఈ సినిమాకు ప్రీమియర్ షో ల ద్వారా అనే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. ఈ మూవీ కి ప్రీమియర్స్ ద్వారానే బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాకు మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కుతాయి అని చాలా మంది భావిస్తున్నారు.
ఈ సినిమా ఓ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి సినిమాకు అత్యంత దగ్గరగా వచ్చింది. కానీ అజ్ఞాతవాసి మూవీ ని మన శంకర వర ప్రసాద్ గారు సినిమా క్రాస్ చేయలేక పోయింది. అసలు విషయం లోకి వెళితే ... చాలా సంవత్సరాల క్రితం విడుదల ఆయన అజ్ఞాతవాసి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 123.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. తాజాగా విడుదలకు సిద్ధం అయినా మన శంకర వర ప్రసాద్ గారు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇలా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన అజ్ఞాతవాసి సినిమాకు అత్యంత దగ్గరగా వచ్చింది. ఇకపోతే మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా ... అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహూ గారపాటి , సుష్మిత కొణిదల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ మూవీ కి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి భారీ లాభాలను అందుకొని బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.