అలాంటి రికార్డ్ సాధించిన సీనియర్ హీరోలలో రజినీకాంత్ తర్వాత చిరంజీవే అంటూ తాజాగా ఒక విషయం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తాజాగా చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రీమియర్స్ తోనే సినిమా అద్భుతంగా ఉండడంతో మౌత్ టాక్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ అని.. సంక్రాంతి విన్నర్ మన శంకర వరప్రసాద్ గారు అని ఎప్పటిలాగే అనిల్ రావిపూడి తన డైరెక్షన్ తో మెప్పించారని ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని బ్లాక్ బస్టర్ చేసారని సినిమా చూసిన నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
అదేంటంటే ఇప్పుడున్న సీనియర్ హీరోలలో సౌత్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో రజినీకాంత్ తర్వాత అలాంటి రికార్డ్ సాధించిన హీరో చిరంజీవే అని తెలుస్తోంది.మరి ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. ఇప్పుడున్న సౌత్ ఇండస్ట్రీ సీనియర్ హీరోలలో రజినీకాంత్ తన సినిమాలతో నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ తో వన్ మిలియన్ డాలర్స్ ని అందుకున్న హీరోలలో ఈయన మొదటి వారు.అయితే రజినీకాంత్ తర్వాత ఈ రేర్ ఫీట్ అందుకున్న సీనియర్ హీరోగా చిరంజీవి పేరు తెచ్చుకున్నారు.
ఈయన ఇప్పటివరకు రెండు సార్లు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ తోనే వన్ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని రాబట్టారు. అలా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో రెండుసార్లు నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ తో వన్ మిలియన్ డాలర్స్ రాబట్టిన ఏకైక హీరోగా మెగాస్టార్ చిరంజీవి అరుదైన రికార్డ్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఇక చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా.. వెంకటేష్ గెస్ట్ రోల్ పోషించారు.