కల్కి 2898 AD : నాకు ఆశ్చర్యం వేసింది.. ఫోన్ చేసి అందరూ అదే అడుగుతున్నారు.. స్వప్న దత్..!

Pulgam Srinivas
ఎప్పటినుండో ఊరిస్తూ వస్తున్న కల్కి 2898 AD సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఇండియా వ్యాప్తంగా అత్యంత క్రేజీ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ హీరోగా నటించగా , అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ మూవీ లో అత్యంత కీలక పాత్రలలో నటించారు. కమల్ హాసన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం , శోభన , మృణాల్ ఠాకూర్ ముఖ్యమైన పాత్రలలో నటించారు.

ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ , దుల్కర్ సల్మాన్ , రామ్ గోపాల్ వర్మ , ఎస్ ఎస్ రాజమౌళి చిన్న చిన్న క్యామియో పాత్రలలో కనిపించారు. ఈ మూవీ ని వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ కూతురు స్వప్న దత్ నిర్మించింది. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా నిన్న విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి స్వప్న సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ ప్రస్తుతం ఫుల్ గా వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... స్వప్న దత్ పోస్ట్ లో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు అంటే చాలా మంది నాకు కాల్ చేసి రికార్డులను క్రాస్ చేసామా అని అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకు అంటే ఆ రికార్డులు సృష్టించిన వారెవరు ఆ రికార్డుల కోసం సినిమాలు తీయరు. మేము కూడా అలాగే తీసాం అని పోస్ట్ చేసింది. ఇకపోతే ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: